కడప ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ కేసులో అవినాశ్ రెడ్డికి మే 31న తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన ఉత్వర్వులను సవాల్ చేస్తూ మృతుడు వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అవినాశ్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.అయితే బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణను సుప్రీం ధర్మాసనం మూడు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు