BRS MLC Kavita : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavita ) పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.

ఈ మేరకు విచారణను అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.

అదే రోజు పిటిషన్ పై తుది విచారణ జరుపుతామని చెప్పింది.

నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ( Nalini Chidambaram, Abhishek Banerjee ) పిటిషన్లతో కాకుండా కవిత పిటిషన్ ను ప్రత్యేకంగా విచారిస్తామని కోర్టు తెలిపింది.అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఇచ్చిన నోటీసులను గతేడాది ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు.

కాగా ఈ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.

Advertisement
Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable