MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) పిటిషన్ పై సుప్రీంకోర్టులో( Supreme Court ) ఇవాళ విచారణ జరగనుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో కవితకు ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఈడీ( ED ) కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.అయితే మద్యం పాలసీ కేసులో ఈడీ సమన్లను కవిత సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈడీ నోటీసులను రద్దు చేయాలని, ఈడీ తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు.అలాగే సీఆర్పీసీ నిబంధనల ప్రకారం ఈడీ విచారణ జరపడం లేదంటూ కవిత ఆరోపించారు.ఈ నేపథ్యంలో కవిత పిటిషన్ పై( Kavitha Petition ) ఇవాళ జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరపనుంది.

ఈ క్రమంలోనే దర్యాప్తు సంస్థల ముందు కవిత హాజరుపై నేటి విచారణతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

తాజా వార్తలు