రసవత్తరం గా మారుతున్న ఖమ్మం రాజకీయం !

ఎన్నికల రోజు దగ్గర పడుతున్న కొద్ది అధికార ప్రతిపక్ష అభ్యర్థుల మధ్య రగడ తీవ్ర స్థాయికి చేరుతుంది.

పార్టీపరమైన విమర్శలను మించి వ్యక్తిగత విమర్శలకు కూడా అభ్యర్థులు పాల్పడడంతో రెండు వైపులా పొలిటికల్ హిట్ తారస్థాయికి చేరుతుంది.

రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్ వర్సెస్ బారాస గా పరిస్థితి మారడం తో ఈ రెండు పార్టీల అభ్యర్థుల సవాళ్లు -ప్రతి సవాళ్లతో రాజకీయ వేడి తారాస్థాయికి చెరినట్టుగా కనిపిస్తుంది .మిగతా చోట్ల ఎలా ఉన్నా ఖమ్మం రాజకీయం మాత్రం రోజు రోజు కి హీట్ పెరిగిపోతున్నట్టుగా తెలుస్తుంది.ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బలమైన పట్టు ఉన్న బారాస కు ఖమ్మం జిల్లాలో మాత్రం అంతంత మాత్రమే ఉంది.

ఇక్కడ అధికార పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు.మరో వైపు ఖమ్మంలో కాంగ్రెస్( khammam congress ) చాలా బలం గా ఉంది.

ఇక్కడ ఉద్దండులైన అభ్యర్థులు తుమ్మల, పొంగులేటి పూర్తిస్థాయిలో ఖమ్మం రాజకీయాలను చేతి లోకి తీసుకోవడంతో ఇప్పుడు అధికార బారాసా- కాంగ్రెస్ ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది.

Advertisement

ఖమ్మం జిల్లాలో బారాస పార్టీ నుంచి అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వమంటూ కాంగ్రెస్ అభ్యర్థులు ప్రతిజ్ఞలు చేయడంతో పువ్వాడ కూడా దానికి దీటుగానే స్పందిస్తున్నారు.పువ్వాడ అజయ్( Puvvada Ajay Kumar ) భారీ స్థాయిలో అవినీతి చేశాడని ,ఖమ్మంలోని కొండలను, గుట్టలను కూడా వదలకుండా దోచుకున్నారని, ఇక్కడ ప్రజల భూములను రాజకీయ అండతో ఆక్రమించుకొని ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేశారంటూ తుమ్మ( Thummala Nageswara Rao )ల ఆరోపిస్తూ ఉంటే, పువ్వాడ కూడా ధీటు గానే బదులిస్తున్నారు పాలేరులో తుమ్మలను గెలిపించి ఉంటే అసలు ఖమ్మం ఊసే తుమ్మల తీసేవారు కాదని, తుమ్మల చుట్టూ ఉన్న వాళ్ళందరూ గంజాయి బ్యాచ్లు తప్ప నికార్సయియన యువకులు తన వెంట మాత్రమే ఉన్నారని తొందరలోనే ఈ తుమ్మల వెంట తిరిగే సైకోలకు ఒక పిచ్చాసుపత్రి కూడా కట్టిస్తానంటూ అజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అధికార బారాసకు గట్టి పోటీ ఇవ్వాలంటే ఖమ్మం జిల్లా మొత్తాన్ని క్వీన్ స్వీప్ చేయాలని చూస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం పూర్తిస్థాయిలో వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.ఏది ఏమైనా రానున్న రోజుల్లో ఖమ్మం రాజకీయ వాతావరణ మరింత తీవ్ర స్థాయికి చేరుతుందన్న అంచనాలు ఏర్పడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు