రక్తహీనత నుంచి అధిక బరువు వరకు ఎన్నో సమస్యలకు చెక్ పెట్టే హెల్తీ స్మూతీ మీకోసం!

రక్తహీనత.ఇటీవల రోజుల్లో కోట్లాది మందిని పట్టిపీడిస్తున్న కామన్ సమస్యల్లో ఒకటి.

రక్తహీనత కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.

ఒక్కోసారి రక్తహీనత ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతుంటుంది.

అందుకే ర‌క్త‌హీన‌త‌ను నివారించుకునేందుకు చాలా మంది మందులు వాడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే హెల్తీ స్మూతీని తీసుకుంటే రక్తహీనత దెబ్బకు పరార్ అవుతుంది.

అలాగే అధిక బరువుతో సహా అనేక సమస్యలకు ఈ స్మూతీ తో చెక్ పెట్టవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.

Advertisement

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్( Oats ) వేసి ఒక కప్పు వాటర్ పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.ఈ లోపు ఒక కప్పు బొప్పాయి పండు( Papaya ) ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న ఓట్స్ వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి పండు ముక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక గ్లాసు హోమ్ మేడ్ బాదం పాలు, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తద్వారా టేస్టీ అండ్ హెల్తీ ఓట్స్ పపాయ స్మూతీ సిద్ధమవుతుంది.ఈ స్మూతీని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే శరీరానికి అవసరమయ్యే ఐరన్ కంటెంట్ పుష్కలంగా లభిస్తుంది.దాంతో రక్తహీనత ( Anemia )సమస్య దూరం అవుతుంది.

అంతేకాదు ఈ స్మూతీని తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీలు సూపర్ ఫాస్ట్ గా బ‌ర్న్ అవుతాయి.ఫ‌లితంగా వెయిట్ లాస్ అవుతారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

అలాగే ఈ స్మూతీని తీసుకోవడం వల్ల కంటి చూపు రెట్టింపు అవుతుంది.జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.చర్మం యవ్వనంగా మెరుస్తుంది.

Advertisement

క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.మహిళల్లో నెలసరి సమస్యలు ఉంటే దూరం అవుతాయి.

జీర్ణ‌ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం సైతం తగ్గుతుంది.

తాజా వార్తలు