ఉదయాన్నే చాయ్, కాఫీ మానేసి ఇది తాగండి .. ఎంతో ఆరోగ్యం

గ్రీన్ టీ ఎవరైనా తాగితే, ఫోజు కొడుతున్నాడు అని కామెంట్ చేస్తారు చాలామంది.కాని గ్రీన్ తాగడం ఫోజు కాదు.

ఆరోగ్యం పట్ల అవగాహన అంటారు దాన్ని.గ్రీన్ టీని అన్ ఆక్సడైజ్డ్ లీఫ్స్ తో తయారు చేస్తారు.

దీంట్లో శరీరానికి పనికివచ్చే యాంటిఆక్సిడెంట్స్, పోలిఫేనాల్స్ ఉంటాయి.* గ్రీన్ టీ చర్మానికి చాలా మంచిది.

రకరకాల చర్మవ్యాధులు వచ్చే అవకాశాల్ని తగ్గిస్తూనే, ముఖాన్ని అందంగా తయారు చేస్తుంది గ్రీన్ టీ.* గ్రీన్ టీకి డెమెన్టియా అనే జబ్బుని నయం చేసే శక్తి ఉందని పరిశోధనల్లో తేలింది.ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

Advertisement

మెదడుని చురుగ్గా ఉంచుతుంది.* గ్రీన్ టీలో ఉండే పొలిఫెనల్స్ క్యాన్సర్ మీద పనిచేస్తుంది.

ముందునుంచి అలవాటు ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాల్ని కూడా తగ్గిస్తుంది.* అల్ట్రావయొలెట్‌ UVB రేస్ నుంచి సంరక్షించే శక్తి గ్రీన్ టీ సొంతం.

* మామూలు టీకి బదులు గ్రీన్ టీ తాగే అలవాటు ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ తక్కువ అని పలు అధ్యయనాలు వెల్లడించాయి.* గ్రీన్ టీ వలన బరువు ఖచ్చితంగా తగ్గుతుందని చెప్పడానికి సాక్ష్యాలు లేకపోయినా, బరువు తగ్గాలనుకునే వారికి తనవంతు సాయం చేస్తుంది గ్రీన్ టీ.లావుగా ఉండేవారు గ్రీన్ టీ తాగడం అలవాటుగా మార్చుకోవాలి.

నువ్వుల నూనెతో ఇలా చేస్తే.. మృదువైన చ‌ర్మం మీ సొంతం!
Advertisement

తాజా వార్తలు