అయ్యప్ప దీక్షలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

శబరిగిరుల్లో కొలువున్న హరిహరసుతుడు అయ్యప్పను దర్శించుకోవడానికి భక్తులు మాలను ధరించి 41 రోజుల పాటు నియమ నిష్టలతో దీక్షను చేపడతారు.ఈ దీక్ష ఎంతో భక్తి భావంతో చేయాలి.

అలాగే చాలా కఠినమైంది.ఈ దీక్షలో భక్తులకు అద్భుతాలు కన్పిస్తాయి.

Health Benefits With Ayyappa Deeksha-Health Benefits With Ayyappa Deeksha-Devoti

ప్రతి రోజు తెల్లవారు జామున చన్నీటి స్నానము, నేల మీద పడుకోవటం,ఒంటి పుట భోజనం, చెప్పులు ధరించకపోవటం వంటి కఠినమైన నియమాలను అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు పాటిస్తారు.ఈ నియమాల వెనక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

తెల్లవారు జామునే లేచి చన్నీటి స్నానం చేయటం వలన శరీరంలో నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది.అందువల్ల ముఖం ప్రశాంతంగా ఉంటుంది.

Advertisement

నేల మీద పడుకోవటం వలన వెన్ను నొప్పి తగ్గటమే కాకుండా కండర పటిష్టతకు దోహదం చేస్తుంది.రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగు అవుతుంది.ఈ సమయంలో అందరూ దీపారాధన చేస్తారు.ఆ దీపం కాంతిలో మనస్సు తేలిక పడుతుంది.ప్రతి రోజు క్రమం తప్పకుండా సామూహికంగా పూజలో పాల్గొనటం వలన సంఘజీవనం మరియు క్రమశిక్షణ, ఇచ్చి పుచ్చుకొనే తత్వం పెరుగుతుంది.

ఎక్కువగా మాట్లాడటం,వివాదాలకు దూరంగా ఉండటం వలన సమయం ఆదా అయ్యి ఆలోచనాశక్తి పెరుగుతుంది.ఈ దీక్ష 40 రోజులు పొగ తాగడం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటే ఆ అలవాటు తగ్గే అవకాశం కూడా ఉంది.

అలాగే మితాహారం, శాఖాహారం తినటం వలన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

స‌న్ ట్యాన్‌కు చెక్ పెట్టే అవిసె గింజ‌లు..ఎలా వాడాలంటే?
Advertisement

తాజా వార్తలు