ఇమ్యూనిటీని పెంచే సీమ చింతకాయ..ఎలా తీసుకోవాలంటే?

ప్ర‌స్తుతం క‌రోనా టైమ్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.మునుప‌టితో పోలిస్తే మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మాయ‌దారి వైర‌స్‌.

ప్ర‌తి రోజు వేల మందిని మింగేస్తుంది.ఈ క్ర‌మంలోనే ఎన్నో కుటుంబాల్లో విషాదాలు నెల‌కొంటున్నాయి.

ఎంద‌రో అనాథులుగా దిక్కుతోచ‌ని స్థితిలో మిగులుతున్నారు.అందుకే క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండేందుకు అంద‌రూ ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచే ఆహారాల‌ను తీసుకుంటున్నారు.

అయితే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో సీమ చింత‌కాయ‌లు కూడా అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.వేస‌వి కాలంలో ఎక్క‌డ చూసినా సీమ చింత‌కాయ‌లే ద‌ర్శ‌న‌మిస్తుంటాయి.

Advertisement

వీటిని శుభ్రం చేసుకుని డైరెక్ట్‌గా తినేయ‌వ‌చ్చు.లేదంటే క‌ర్రీ రూపంలోనూ తీసుకోవ‌చ్చు.

గులాబీ, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉండే ఈ సీమ చింత‌కాయ‌లు కాస్త తియ్య‌గా, కాస్త వ‌గ‌రు గా ఉంటాయి.అలాగే వీటిలో పోష‌కాలు కూడా మెండుగానే ఉంటాయి.

విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్, ప్రోటీన్స్‌, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోష‌కాలు నిండి ఉండే సీమ చింత‌కాయ‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోవాలి అని భావించే వారు ప్ర‌తి రోజు ఒకటి, రెండు చొప్పున సీమ చింత‌కాయ‌ల‌ను తీసుకోవాలి.

ఇలా చేస్తే వాటిలో ఉండే విట‌మిన్ సి మ‌రియు ఇత‌ర యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ సిస్ట‌మ్‌ను బ‌ల‌ప‌రుస్తాయి.దాంతో వైర‌స్‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.అలాగే సీమ చింత‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఒత్తిడి, డిప్రెష‌న్‌, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు ప్ర‌తి రోజు త‌గిన మోతాదులో సీమ చింతకాయ‌లు తీసుకుంటే.ర‌క్తంలో చెక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.అతి ఆక‌లి త‌గ్గు ముఖం ప‌డుతుంది.

Advertisement

అదేవిధంగా, వెయిట్ లాస్ కూడా అవుతాయి.

తాజా వార్తలు