బెల్లం తినడం వలన ఇన్ని లాభాలు ఉన్నాయా..?

ఈ మధ్యకాలంలో చాలామంది పంచదారకి అలవాటు అయిపోయారు.ఒకప్పుడు తీపి అంటే కేవలం బెల్లం( Jaggery ) వాడేవారు.

పంచదార పక్క రిఫైండ్ ఆహారం.దీన్ని పోషకాలని తొలగిపోయి, రుచి మాత్రమే మిగిలేలా శుద్ధి చేసిన పదార్థాన్ని చక్కెర అంటారు.

కానీ బెల్లం మాత్రం అలా కాదు.బెల్లం లో పీచు పదార్థం ఉంటుంది.

ఇది జీర్ణాశయానికి సహాయపడుతుంది.అలాగే మలబద్దకంతో బాధపడుతున్నట్లయితే మలబద్ధకం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.

Advertisement

బెల్లం లో జింక్, సెలీనియం ఉండడం వలన ఒంట్లోని వ్యర్థాలను వదిలించే డిటాక్స్ లా కూడా పనిచేస్తుంది.

దీంతో కాలేయాన్ని( Liver ) ఆరోగ్యంగా ఉంచుతుంది.కఫ సంబంధ వ్యాధులకు చెక్ పెట్టి, ఊపిరితిత్తులకు బెల్లం బాగా మేలు చేస్తుంది.ముఖ్యంగా శీతాకాలం నీటిలో ఒక చెంచాడు బెల్లం తీసుకుంటే జలుబు, దగ్గు, గొంతునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

దీనికి వెంటనే చల్లబరిచే గుణం కూడా ఉంటుంది.కాబట్టి బెల్లం పాకం తాగమని సూచిస్తూ ఉంటారు.

ఇక బెల్లాన్ని రామనవమికి కూడా ఓ సాంప్రదాయంగా మార్చారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇక బెల్లంతో పాటు కాస్త అల్లం, నువ్వులు, నెయ్యి కలిపి మిఠాయి తయారు చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

దీంతో కీళ్ల నొప్పులు( Knee Pains ) కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.ఇక బెల్లం లో ఐరన్ లాంటి పోషకాలు కూడా ఉంటాయి.ఇవి రక్తపోటును తగ్గించే గుణం కలిగి ఉంటాయి.

Advertisement

అలాగే రక్తాన్ని శుద్ధి చేసే లక్షణం కూడా ఉంటుంది.ఇక కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నట్లయితే బెల్లం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

ఇక భోజనం తర్వాత మిఠాయి తీసుకునే అలవాటు ఉన్నవారు చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలా మేలు జరుగుతుంది.ఇక షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు మాత్రం దీనికి దూరంగా ఉండటమే మంచిది.

తాజా వార్తలు