హెల్త్‌కి మంచిద‌ని చెరుకుర‌సం తాగేవారు ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి!

చెరుకు రసం( Sugarcane Juice ) పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మందికి ఫేవరెట్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు.

ముఖ్యంగా ప్రస్తుత వేసవికాలంలో చెరుకు రసం తాగడానికి బాగా ఇష్టపడుతుంటారు.

అయితే హెల్త్ కి మంచిదని చెరుకు రసం తాగేవారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.ఆరోగ్యపరంగా చెరుకు రసం నిజంగా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.

అయినప్పటికీ కొందరికి మాత్రం చెరుకు రసం సరిపడదు.ఆ కొందరు ఎవరు? అసలు చెరుకు రసం అందించే ప్రయోజనాలు ఏంటి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.కాలేయ ఆరోగ్యానికి( Liver Health ) చెరుకు ర‌సం ఎంతో మేలు చేస్తుంది.

చెరుకు రసం కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.జాండిస్ తో స‌హా కాలేయ సంబంధిత సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుంది.

Advertisement
Health Benefits Of Drinking Sugarcane Juice Details, Sugarcane Juice, Sugarcane

గ్లూకోజ్ అధికంగా ఉండటంతో చెరుకు ర‌సం స‌హ‌జంగానే త‌క్ష‌ణ శ‌క్తిని( Instant Energy ) అందిస్తుంది.నీర‌సం, అల‌స‌ట‌ను క్ష‌ణాల్లో దూరం చేస్తుంది.

చెరుకు రసం ఫ్లావనాయిడ్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.ఇవి క్యాన్సర్ కణాలను అరికట్టేందుకు సహాయపడ‌తాయి.

ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు బ్రెస్ట్‌ క్యాన్సర్ వ‌చ్చే రిస్క్ ను చెరుకు ర‌సం త‌గ్గించ‌గ‌ల‌దు.

Health Benefits Of Drinking Sugarcane Juice Details, Sugarcane Juice, Sugarcane

క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్ అధికంగా ఉండ‌టం వ‌ల్ల చెరుకు ర‌సం ఎముక‌ల‌ను బ‌లోపేతం చేస్తుంది.మూత్రంలో మంట, కిడ్నీ సంబంధిత సమస్యలను తగ్గించేందుకు, బాడీని హైడ్రేట్ గా ఉంచేందుకు చెరుకు ర‌సం స‌హాప‌డుతుంది.మొటిమలు, చర్మ సంబంధిత సమస్యల నివార‌ణ‌లో కూడా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

పరువు పోతుందని భయపడ్డాను.. హీరోయిన్ సుహాసిని సంచలన వ్యాఖ్యలు వైరల్!
ఈ లడ్డూను ఒక్కటి తీసుకుంటే చాలు రోజంతా ఫుల్ ఎన‌ర్జిటిక్ గా ఉంటారు!

అయితే ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ కొంద‌రు చెరుకు ర‌సాన్ని ఎవైడ్ చేయ‌డ‌మే మంచిది.

Health Benefits Of Drinking Sugarcane Juice Details, Sugarcane Juice, Sugarcane
Advertisement

జలుబు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటే చెరుకుర‌సం తాగ‌కూడ‌దు.చెరుకుర‌సం బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ను ఇస్తుంది.ఇది జలుబును తీవ్ర‌త‌రం చేస్తుంది.

అలాగే గర్భధారణ సమయంలో చెరుకురసం మంచిదే, కానీ కొంత మందికి రక్తంలో చక్కెర స్థాయులు పెరిగే అవకాశం ఉంటుంది.అందవ‌ల్ల ప్రెగ్నెంట్స్ డాక్ట‌ర్ స‌ల‌హాతో చెరుకు ర‌సం తీసుకోవాలా? వ‌ద్దా? అన్న‌ది డిసైడ్ అవ్వాలి.మ‌ధుమేహం ఉన్న‌వారు కూడా చెరుకు ర‌సం తాగేముందు వైద్యుల స‌లహా తీసుకోవాలి.

ఇక చెరుకురసం క్యాల‌రీలతో కూడిన పానీయం, అధికంగా తాగితే బరువు పెరగడానికి దారితీస్తుంది.ఒక‌వేళ బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న వారైతే పరిమితంగా తీసుకోవ‌డం చాలా ముఖ్యం.

తాజా వార్తలు