రోజుకో క‌ప్పు కుంకుమపువ్వు టీ తాగితే ఏం అవుతుందో తెలుసా..?

అత్యంత విలువైన మరియు శక్తివంతమైన సుగంధ ద్రవ్యాల్లో కుంకుమ‌పువ్వు( Saffron ) ఒక‌టి.కాష్మీర్, ఇరాన్, స్పెయిన్ వంటి ప్రాంతాల్లో కుంకుమ‌పువ్వును పండిస్తారు.

బిర్యానీ, పాయసం, లడ్డూ వంటి వంటకాలకు మంచి రంగు మరియు ప్ర‌త్యేక‌మైన సువాసనను జోడించ‌డానికి కుంకుమ‌పువ్వును వాడ‌తారు.అయితే కుంకుమపువ్వు ఖ‌రీదైన‌ది మాత్ర‌మే కాదు అంత్యంత ఆరోగ్య‌క‌ర‌మైన‌ది కూడా.

ముఖ్యంగా రోజుకో క‌ప్పు కుంకుమపువ్వు టీ( Saffron Tea ) తాగితే అద్భుత‌మైన ఆరోగ్య లాభాలు పొందుతారు.కుంకుమపువ్వు టీ త‌యారీ కోసం ముందు ఒక గ్లాస్ హాట్ వాట‌ర్ తీసుకుని అందులో నాలుగైదు కుంకుమపువ్వు రేఖ‌లు వేసి ఐదు నుంచి ప‌ది నిమిషాలు నాన‌బెట్టండి.

ఆపై రుచి కోసం వ‌న్ టీ స్పూన్ తేనె( Honey ) లేదా నిమ్మ‌ర‌సం( Lemon ) క‌లిపితే టీ రెడీ అయిన‌ట్లే.కుంకుమపువ్వు టీలో చాలా శక్తివంతమైన ఔషధ గుణాలు ఉంటాయి.

Advertisement

రోజుకో కప్పు చొప్పున తాగితే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.కుంకుమపువ్వు టీ మెదడు నరాలకు శక్తినిచ్చి.

ఆందోళన, డిప్రెషన్‌లను దూరం చేస్తుంది.మూడ్‌ను ఉత్సాహంగా మారుస్తుంది.

చ‌ర్మ ఆరోగ్యాన్ని పెంచ‌గ‌ల సామ‌ర్థ్యం కుంకుమపువ్వు టీకి ఉంది.ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఆరోగ్యకరమైన నిగారింపు, మెరుపు ఇస్తాయి.అలాగే ప్ర‌స్తుత రోజుల్లో ఎంద‌రో మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య హార్మోన్ల అసమతుల్యత.

అయితే కుంకుమపువ్వు టీ ఈ స‌మ‌స్య‌ను పరిష్కరించడంలో స‌హాయ‌ప‌డుతుంది.నిత్యం మ‌హిళ‌లు ఒక క‌ప్పు కుంకుమపువ్వు టీ తాగితే హార్మోన్ల సంతులనం జ‌ర‌గ‌డ‌మే కాకుండా నెల‌స‌రి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

వెయిట్ లాస్( Weight Loss ) అవ్వాల‌ని ట్రై చేస్తున్న‌వారికి కుంకుమపువ్వు టీ బెస్ట్ ఛాయిస్ అవుతుంది.ఈ టీ ఆకలిని నియంత్రిస్తుంది.తద్వారా బరువు తగ్గడం సులభమవుతుంది.

Advertisement

అంతేకాకుండా కుంకుమపువ్వు టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.మ‌లబద్ధకం స‌మ‌స్య‌ను నివారిస్తుంది.

కుంకుమ‌పువ్వు టీలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శ్వాసకోశ వ్యాధులను త‌గ్గిస్తాయి.జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి వేగంగా ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయి.

తాజా వార్తలు