వామ్మో..వాక్కాయ‌లు తింటే అన్ని ప్ర‌యోజ‌నాలా?

వాక్కాయ‌వ‌ర్షాకాలంలో విరి విరిగా దొరికే పండ్ల‌లో ఇవి ఒక‌టి.రుచికి కాస్త వ‌గ‌రు, కాస్త పుల్ల‌గా ఉండే వాక్కాయ‌ల‌ను డైరెక్ట్‌గా తిన‌డ‌మే కాదు.

వాటితో ఎన్నో వంట‌లు కూడా చేస్తుంటారు.వాక్కాయ ప‌చ్చ‌డి, వాక్కాయ ప‌ప్పు, వాక్కాయ పులిహోర‌, వాక్కాయ స‌లాడ్ ఇలా ర‌క‌ర‌కాలుగా చేస్తుంటారు.

వాక్కాయ‌ల‌తో ఎలా చేసినా రుచి అద్భుతంగా ఉంటుంది.అలాగే అనేక పోష‌కాలు నిండి ఉండే వాక్కాయ‌లు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్ర‌యోజ‌నాలను అందిస్తాయి.

మ‌రి ఆల‌స్యం చేయ‌కుండా వాక్కాయ‌లు తిన‌డం వ‌ల్ల పొందే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం.ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలో దాదాపు ప్ర‌తి ఒక్క‌రు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు తెగ ప్రయ‌త్నిస్తున్నారు.

Advertisement
Health Benefits Of Carissa Carandas! Health, Benefits Of Carissa Carandas, Caris

అయితే అందుకు వాక్కాయ‌లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.వాక్కాయల‌ను తీసుకుంటే వాటిలో పుష్క‌లంగా ఉండే విట‌మిన్ సి ఇమ్యూనిటీ సిస్ట‌మ్‌ను బూస్ట్ చేస్తుంది.

దాంతో వైర‌స్‌లు, అంటు వ్యాధులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.అలాగే వాక్కాయ జ్యూస్ తాగడం వ‌ల్ల శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది.

నీర‌సం, అల‌స‌ట, ఒత్తిడి, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా కూడా ఉంటారు.

Health Benefits Of Carissa Carandas Health, Benefits Of Carissa Carandas, Caris

ప్ర‌తి రోజుకు త‌గిన మోతాదులో వాక్కాయ‌ల‌ను తీసుకుంటేదంతాలు, చిగుళ్లు దృఢంగా మార‌తాయి.మ‌రియు నోటి దుర్వాస‌న స‌మ‌స్య సైతం త‌గ్గు ముఖం ప‌డుతుంది.వాక్కాయ‌ల‌ను డైట్‌లో చేర్చు కోవ‌డం వ‌ల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ క‌రుగుతుంది.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

దాంతో గుండె పోటు, ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.గుండె కండ‌రాలు కూడా బ‌లోపేతం అవుతాయి.

Health Benefits Of Carissa Carandas Health, Benefits Of Carissa Carandas, Caris
Advertisement

అంతేకాదు, వాక్కాయ‌లు తీసుకుంటే గ్యాస్, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు ప‌రార్ అవుతాయి.జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు కూడా మెరుగు పడుతుంది.కాబ‌ట్టి, ఇక‌పై వాక్కాయ‌లు దొరికితే.

అస్స‌లు మిస్ చేసుకోకండి.

తాజా వార్తలు