వారం రోజుల పాటు యాలకుల నీటిని త్రాగితే శరీరంలో కలిగే అద్భుతమైన మార్పులు

పులావ్,బిర్యానీలు నోరూరుంచే వాసన రావాలన్నా, పాయసం ఘుమఘమ లాడాలన్నా యాలకులు ఉండాల్సిందే.యాలకులు మంచి వాసన కోసమే కాదు.

యాలకుల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.మౌత్ అల్సర్ , జీర్ణ సమస్యలు, డిప్రెషన్ వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలకు విరుగుడుగా యాలకులు ఉపయోగిస్తున్నారు.

యాలకులు ఆహారానికి మంచి ఫ్లేవర్ ని ఇవ్వటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.యాలకల్లో క్యాల్షియం,మినిరల్స్, పొటాషియం, సల్ఫర్ మరియు మాంగనీస్ లు సమృద్ధిగా ఉన్నాయి.

ఇంకా యాంటీ సెప్టిక్, యాంటీఆక్సిడెంట్, కార్మినేటివ్, డైజెస్టివ్, డ్యూరియాటిక్, స్టిమ్యులేటివ్ మరియు టానిక్ లక్షణాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి.ఇన్ని ఉపయోగాలు ఉన్నా యాలకులు నీటిలో మరిగించి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయో తెలుసుకుందాం.

Advertisement

అసలు యాలకుల నీటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.ఒక కప్పు నీటిలో కొన్ని యాలకులను వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే త్రాగాలి.

ప్రతి రోజు యాలకుల నీటిని త్రాగటం వలన వికారం, వాంతులు, ఎసిడిటి, కడుపుబ్బరం, గ్యాస్, ఆకలి, మలబద్దకం వంటి సమస్యలకు విరుగుడుగా పనిచేస్తుంది.ప్రతి రోజు యాలకుల నీటిని త్రాగటం వలన కిడ్నీలు, శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది.

అందుకే రోజూ యాలకుల నీటిని తాగమని నిపుణులు సూచిస్తున్నారు.రోజూ యాలకలు మరిగించిన నీటిని తాగడం వల్ల డిప్రెషన్ కు వ్యతిరేఖంగా పోరాటం చేస్తుంది.

కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.క్రమం తప్పకుండా ప్రతి రోజు యాలకుల నీటిని త్రాగటం వలన మౌత్ అల్సర్, ఇన్ఫెక్షన్స్ నివారించడంతో పాటు .గొంతు నొప్పి తగ్గుతుంది.దగ్గు,జలుబు,బ్రొంకైటిస్ వంటి వాటికీ మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

ఇలా చేస్తే నిత్యం సంతోష‌మే... అవ‌ధులు లేని ఆనందం కూడా!

యాలకల్లో ఫైబర్, డ్యూరియాటిక్ గుణాలు ఉండటం వల్ల వల్ల బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.యాలకల్లో ఉండే విటమిన్స్, ఫైటో న్యూట్రీయంట్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ యాంటీఆక్సిడెంట్స్ గా పనిచేసి శరీరంలో వ్యాధులకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను నాశనం చేస్తుంది.

Advertisement

యాలకల్లో ఉండే విలువైన ఆయిల్ గుణాల వల్ల వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి శరీరాన్ని తాకకుండా చేస్తాయి.చూసారుగా ఫ్రెండ్స్ ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా యాలకుల నీటిని త్రాగి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

తాజా వార్తలు