కాలీఫ్లవర్ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వారు మాత్రం తినకూడదు?

ప్రస్తుత వింటర్ సీజన్ లో విరివిరిగా లభ్యమయ్యే కూరగాయల్లో కాలీఫ్లవర్ ఒకటి.

పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది ఇష్టంగా తినే కూరగాయల్లో కూడా కాలీఫ్లవర్ ముందు వరుసలో ఉంటుంది.

కాలీఫ్లవర్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తుంటారు.మన దేశంలో ఎంతో పాపులర్ అయిన కాలీఫ్లవర్ కు దాదాపు 2300 ఏళ్ల నాటి చరిత్ర ఉందట.

ఆసియా, మధ్యధరా సముద్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరిగే కాలీఫ్లవర్ ను బ్రిటిష్ వారు మన ఇండియాకు తీసుకొచ్చారు.చూడడానికి ఆకర్షణీయంగా, తినడానికి రుచిగానే కాదు కాలీఫ్లవర్( Cauliflower ) ఎన్నో విలువైన పోషకాలను సైతం కలిగి ఉంటుంది.

ఆరోగ్యపరంగా కాలీఫ్లవర్ అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.

Advertisement

అనేక జబ్బుల నుంచి రక్షిస్తుంది.కాలీఫ్లవర్ లో మెండుగా ఉండే ఐరన్ రక్తహీనతను తరిమి కొడుతుంది.అలాగే కాల్షియం, విటమిన్ కె ఎముకలను బలోపేతం చేస్తాయి.

రోగ‌ నిరోధక శక్తి( Immunity Power )ని పెంచే విటమిన్ సి కూడా కాలీఫ్లవర్ లో ఉంటుంది.అంతేకాదు కాలీఫ్లవర్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి అండగా ఉంటాయి.

కాలీఫ్లవర్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.రక్తపోటు అదుపులో ఉంటుంది.నరాల బలహీనత సైతం దూరం అవుతుంది.

అయితే కాలీఫ్లవర్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ అతిగా తీసుకుంటే మాత్రం అనేక సమస్యలు తలెత్తుతాయి.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

ముఖ్యంగా కాలీఫ్లవర్ లో ఉండే పలు సమ్మేళనాలు కడుపు ఉబ్బరానికి కార‌ణం అవుతాయి.మరియు గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి.ఇక హైపో థైరాయిడ్( Hypothyroid ) తో బాధపడుతున్న వారు కాలీఫ్లవర్ కు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ఎందుకంటే థైరాయిడ్ గ్రంధిలోని హార్మోన్ ఉత్పత్తిలో అయోడిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.అయితే కాలీఫ్లవర్ లో ఉండే పలు సమ్మేళనాలు అయోడిన్ పనితనం పై ప్రభావం చూపుతాయి.

అందుకే కాలీఫ్లవర్ ను ఎవైడ్ చేయాలి.

తాజా వార్తలు