క్రికెట్ ప్ర‌పంచాన్ని షాక్‌కు గురి చేసిన తాలిబ‌న్లు.. ఏం చేశారంటే..?

ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి ఆప్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్న సంగతి అందరికీ విదితమే.కాగా, ప్రస్తుతం ఆప్ఘన్‌లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది.

ఆ దేశ ప్రజలు భయంతో వణికిపోతున్నారు.ఈ క్రమంలోనే క్రికెట్‌కు తాలిబన్లు వ్యతిరేకంగా ఉంటారని అందరూ అనుకున్నారు.

తమ దేశ క్రికెటర్స్‌ను వన్డే సిరీస్‌కు అనుమతించబోరని ఎక్స్‌పెక్ట్ చేశారు.కానీ, వారు క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌లో ముంచేసే వార్త చెప్పారు.

ఆప్ఘన్ క్రికెటర్స్ వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు పర్మిషన్ ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే అఫ్గనిస్తాన్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కి తాలిబాన్లు ఒప్పుకున్నట్లు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది.

Advertisement
The Taliban Shocked The Cricketing World .. What Did They Do Taliban, Cricket

ఆల్రెడీ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే సిరీస్‌ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది.వన్డే సిరీస్‌ నిర్వహణకు తాలిబన్ల నుంచి మద్దతు లభించడంతో క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఆశ్చర్యంలో మునిగిపోయిందనే చెప్పొచ్చు.

సెప్టెంబర్‌ 1 నుంచి 5 వరకు శ్రీలంకలోని హంబన్‌తోట వేదికగా పాక్‌, ఆఫ్గన్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరగాల్సి ఉంది.ఈ సంగతులు ఇలా ఉండగా ప్రస్తుతం అఫ్గాన్‌లో నెల‌కొన్న అనిశ్చిత ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆ దేశ క్రికెటర్స్ ఫ్యూచర్ గంద‌ర‌గోళంలో ప‌డింది.

రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీ లాంటి స్టార్‌ క్రికెటర్లైతే ఐపీఎల్‌ తదితర లీగ్‌ల్లో పాల్గొంటామని ఆల్రెడీ అనౌన్స్ చేశారు.కానీ, మిగాతా అఫ్గాన్‌ జాతీయ క్రికటర్స్ పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది.

ఇక ఆ దేశ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ ఇటీవల ఎమోషనల్ ట్వీట్ చేసిన సంగతి అందరికీ విదితమే.తమ దేశంలో తాలిబన్ల పాలనపై స్పందించాడు.

The Taliban Shocked The Cricketing World .. What Did They Do Taliban, Cricket
ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?
బిజీ రోడ్డుపై రాంగ్ రూట్‌లో పిల్లాడు బైక్ రైడింగ్.. తర్వాతేం జరిగిందో మీరే చూడండి!

స్వాతంత్ర్యదినోత్సవం రోజున రషీద్ ఖాన్ చేసిన ట్వీట్ అప్పట్లో వైరలయింది.దేశం కోసం మనమందరం కొంత సమయాన్ని కేటాయిద్దామని, దేశం కోసం చేసిన త్యాగాలను ఎప్పటికీ మరవలేమని, శాంతియుత అఫ్గాన్‌ రాజ్య స్థాపన కోసం మనమందరం ప్రార్థిద్దామని రషీద్ ఖాన్ పిలుపునిచ్చారు.ఈ క్రమంలోనే ఇందుకుగాను ఐక్యరాజ్యసమితి నుంచి సాయం ఆశిస్తున్నాట్టు తెలిపాడు రషీద్.

Advertisement

తాజా వార్తలు