ప్రపంచంలోనే అత్యంత ఫన్నీ బౌలర్ ఇతడే.. ఎలా బౌలింగ్ చేస్తున్నాడో చూస్తే నవ్వాగదు..!

క్రికెట్ లో ఒక్కో బౌలర్ ఒక్కో శైలిలో బౌలింగ్ చేస్తుంటాడు.అయితే కొందరు బౌలింగ్ చేసే తీరు అందరికీ నవ్వు పుట్టిస్తుంది.

ఇప్పటి వరకు లథిస్ మలింగా, పాల్ ఆడమ్స్, సోహైల్ తన్వీర్ వంటి చాలా మంది బౌలర్లు తమ ప్రత్యేకమైన బౌలింగ్ తో ఆశ్చర్యపరిచాడు.మీరు బౌలింగ్‌ను కొత్తగా చూసేవారికి నవ్వురాక తప్పదు.

అయితే తాజాగా వీరందరికీ మించి ఒక బౌలర్ తెగ నవ్విస్తున్నాడు.అతడు బౌలింగ్ వేసే తీరుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ బౌలర్ ఎవరు? ఏ మ్యాచ్ లో అతడు ఫన్నీగా బౌల్ చేస్తూ కనిపించాడు? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ప్రస్తుతం ఇంగ్లాండ్ దేశంలో ఓ విలెజ్‌ క్రికెట్‌ లీగ్‌ జరుగుతోంది.

Advertisement

ఇందులో స్పిన్‌ బౌలర్‌ అయిన జార్జ్ మెక్‌మెనెమీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు.ఇందుకు కారణం ఇతడు చాలా ఫన్నీగా బౌలింగ్ చేయడమే.

బహుశా ఏ బౌలర్ కూడా ఇంత హాస్యాస్పదంగా బౌల్ చేసి ఉండడేమో అనేంతలా ఇతడు బౌలింగ్ చేశాడు.వైరల్ అవుతున్న వీడియోలో ఈ బౌలర్ బౌల్ చేసేటప్పుడు క్రీజుకు ముందు నిలబడి డాన్స్ వేసినట్టు కాళ్లు పైకి లేపుతూ దించుతూ కనిపించాడు.

ఆ తర్వాత బంతిని విసిరాడు.స్పిన్ బౌలర్ కాబట్టి నెమ్మదిగానే బౌల్ చేశాడు.

అయినా కూడా బ్యాటర్‌ దానిని అసలు ఆడలేకపోయాడు.ఎందుకంటే ఈ బౌలింగ్‌తో బ్యాటర్‌ బాగా కన్ఫ్యూజ్‌ అయ్యాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 1, శనివారం 2023

ఈ ఫన్నీ వీడియోని స్వయంగా జార్జ్‌ మెక్‌మెనెమీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.చూసేందుకు నేను మీకు ఓ వెర్రివాడిలా కనిపించొచ్చు.బహుశా నేను ప్రపంచంలోనే అత్యంత చెత్త క్రికెటర్‌ అయ్యుండొచ్చు.కానీ ఈ క్రికెట్‌ ఆట నా ప్రాణాలను కాపాడింది.

Advertisement

నన్ను ఎంతగానో బాధిస్తున్న మానసిక సమస్యల నుంచి బయట పడేసింది.అందుకే క్రికెట్‌కు థాంక్స్ చెబుతున్నా.

నా ఆట పట్ల మా అమ్మ ఎంతగానో గర్విస్తోంది.లవ్‌ యూ క్రికెట్‌ అని జార్జ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

కాగా ఈ వీడియో ఇప్పుడు విస్తృతంగా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

తాజా వార్తలు