ఆయనకు ఎమ్మెల్సీ పదవీ ! మంత్రి గారికి బిగ్ రిలీఫ్

ఇటీవల వైసిపి( YCP ) నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారంతా దాదాపు పార్టీకి వీర విధేయులే.

సామాజిక వర్గాల పెద్దపీట వేస్తూ , అత్యంత నమ్మకస్తులకు జగన్ ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు.

కొద్దిరోజుల క్రితం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ ఆ మార్క్ కనిపించింది.ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారంతా 2029 ఎన్నికల చివరి వరకు పదవుల్లో ఉండబోతున్నారు.

దీంతో శాసనమండలిలో వారు కీలకం కాబోతున్నారు.అందుకే జగన్ ఈ అవకాశం కల్పించారు.

ప్రస్తుతం వైసీపీ తరఫున ఎమ్మెల్సీలు పదవులు పొందిన వారిలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట కు చెందిన కీలక నేత మర్రి రాజశేఖర్ ఉన్నారు.ఈయన ఎమ్మెల్సీ గా గెలుపొందడం తో , ఈ చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి విడదల రజినీకి పెద్ద రిలీఫ్ గా కనిపిస్తోంది.

Advertisement

మర్రి రాజశేఖర్( Marri Rajasekhar ) ఎమ్మెల్సీగా ఉండడంతో 2029 ఎన్నికల్లోను చిలకలూరిపేట టికెట్ ఖాయమని రజనీ ధీమా గా ఉన్నారు  ఇప్పటి వరకు టికెట్ వస్తుందా రాదా అన్న అనుమానంతో ఉన్న రజినీకి మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ రావడంతో టికెట్ పై నమ్మకం కుదిరింది.

అలాగే మంత్రిగాను జగన్( jagan ) వద్ద మంచి మార్కులే పడుతుండడం వంటివన్నీ,  రజినీకి కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి.అంతే కాకుండా మర్రి  రాజశేఖర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం,  ఈ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండడంతో,  రాబోయే ఎన్నికల్లోనూ ఇవన్నీ తమకు కలిసి వస్తాయని రజిని అంచనా వేస్తున్నారు .తన ప్రత్యర్థైన టిడిపి కి చెందిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ను ఓడించేందుకు మరింత బలం దొరుకుతుందనే నమ్మకంతో రజిని ఉన్నారు.ప్రస్తుతం జగన్ క్యాబినెట్ లో కీలకమైన వైద్య ఆరోగ్యశాఖను విడుదల రజిని( Vidudala Rajini )నిర్వహిస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో రజినీకి టికెట్ దక్కి అవకాశం అంతంత మాత్రమేనని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది.అయితే ఇప్పుడు రాజశేఖర్ కు ఎమ్మెల్సీ దక్కడం తో రజిని వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు