రూ.40 అప్పు చేసి లాటరీ కొన్నాడు.. మరికొద్ది గంటల్లోనే కోటీశ్వరుడయ్యాడు..

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్‌లో( East Burdwan, West Bengal ) ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది.

ఒక దినసరి కూలీ అదృష్టం కొద్దీ అనుకోకుండా చాలా తక్కువ వ్యవధిలోనే కోటీశ్వరుడు అయ్యాడు.

మేకల మేత కోసం గడ్డి కోసేందుకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఈ శుభవార్త అతనికి తెలిసింది.ఈ వార్త గ్రామంలో వ్యాపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

అతడి ఇంటి వద్దకు వెళ్లి మరీ కంగ్రాట్యులేషన్స్ తెలిపారు.వివరాల్లోకి వెళితే మంగల్‌కోట్‌ మండలం, ఖుర్తుబాపూర్‌( Qurtubapur ) గ్రామానికి చెందిన దినసరి కూలీ భాస్కర్( Bhaskar ) కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

పొలం పనులు చేసుకుంటూ బార్కీలు పెంచుతూ జీవిస్తూ ఉన్నాడు.ఏదో ఒక రోజు తన కల నెరవేరుతుందని ఆశతో అతడు గత పదేళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటున్నాడు.

Advertisement

ఆదివారం ఉదయం కూడా లాటరీ కొనాలనుకున్నాడు కానీ అతని వద్ద డబ్బులు లేవు.దాంతో రూ.40 అప్పు చేసి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.మధ్యాహ్నం తిరిగి వచ్చేసరికి అతడు దినసరి కూలీ లాటరీలో కోటి రూపాయల బహుమతి గెలుచుకున్నట్టు తెలిసింది.

ఆదివారం మేకలకు గడ్డి కోసేందుకు నాపర బస్టాండ్‌కు వచ్చానని, అయితే లాటరీ టికెట్ కొనేందుకు డబ్బులు లేవని, అయినా లక్కు పరీక్షించుకోవాలని ఆశతో తనకు తెలిసిన వారి దగ్గర 40 రూపాయలు అప్పుగా తీసుకుని, మమేజుల్ భాయ్( Mamezul Bhai ) లాటరీ కౌంటర్లో 60 రూపాయలకు 95H83529 టిక్కెట్టు కొన్నానని భాస్కర్ చెప్పాడు.మధ్యాహ్నం లాటరీలో మొదటి బహుమతి వచ్చిందని తెలిసి తన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయని పేర్కొన్నాడు.

ఈ లాటరీ టిక్కెట్‌ను అమ్మిన విక్రయదారు మౌలిక్‌ సేఖ్‌ లాటరీ గెలిచినట్లు మధ్యాహ్నం ఒకటి 20 నిమిషాలకు తెలిసిందని పేర్కొన్నాడు.లాటరీ బహుమతి గెలుచుకున్న తర్వాత, భాస్కర్ ఒక మంచి ఇల్లు కట్టుకుంటానని చెప్పాడు.తన కూతుళ్ల పెళ్లికి తీసుకున్న అప్పును కూడా తీరుస్తానని పేర్కొన్నాడు.

వ్యవసాయం కోసం కొంత భూమిని కొనుగోలు చేయడానికి డబ్బును ఉపయోగిస్తానని చెప్పాడు.మొత్తం మీద ఈ దినసరి కూలీ ఆర్థిక బాధలన్నీ ఒక లాటరీ తో తొలగిపోతాయని చెప్పవచ్చు.

గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. మందులతో అవసరం లేకుండా ఇలా చెక్ పెట్టండి!
Advertisement

తాజా వార్తలు