పూజారిగా విధులు నిర్వహిస్తున్న ఏడేళ్ల బాలుడు.. హైకోర్టు ఫైర్!

ఏ వృత్తిలో అయినా సరే చిన్న పిల్లలు పని చేయడం చట్ట రీత్యా నేరం.

మైనర్ బాలబాలికల చేత పనులు చేయిస్తే చట్టం కఠిన చర్యలు తీసుకుంటుంది.

ఇదంతా తెలిసిన కూడా ఒక ఆలయంలో ఏడేళ్ల బాలుడు పూజారిగా విధులు నిర్వహిస్తున్నాడు.పుస్తకాలు మోయాల్సిన ఆ బాలుడు పూజారి బాధ్యతలు తీసుకున్నాడు.

ఈ విషయం బయటకు రావడంతో హైకోర్టు సీరియస్ అవుతుంది.ఈ ఘటన తమిళనాడు నీలగిరి అమ్మవారి ఆలయంలో జరిగింది.

ఈ ఆలయంలో ఏడేళ్ల బాలుడు పూజారిగా విధులు నిర్వహిస్తున్నాడు.వంశ పారంపర్యంగా వచ్చే వృత్తిని ఆ బాలుడు నిర్వహిస్తున్నాడు.

Advertisement
HC To Decide Validity Of Making 6-year-old From Badaga Community A Temple Priest

ఎంత వంశ పారపర్యం అయినప్పటికీ మైనర్ పిల్లలతో పని చేయించడం నేరం.అందుకే దీనికి వివరణ కోరుతూ హైకోర్టు దేవాదాయశాఖ ను ప్రశ్నించింది.

తమిళనాడు నెడుకాడు గ్రామంలో ఒక అమ్మవారి ఆలయం ఉంది.ఆ అమ్మవారు బడుగు వర్గానికి కులదేవత.1994 మే 25 నుండి ఈ ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చింది.ఇక ఈ ఆలయంలో వంశపార పర్యంలో భాగంగా గోపాలకృష్ణ అనే వ్యక్తి తన ఏడేళ్ల కుమారుడిని పూజారిగా నియమించారు.

Hc To Decide Validity Of Making 6-year-old From Badaga Community A Temple Priest

ఈ విషయంపై నీలగిరి జిల్లా కోతగిరి గ్రామానికి చెందిన శివన్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేసాడు.ఏడేళ్ల బాలుడు పూజారిగా విధులు నిర్వహిస్తుండడంతో అతడి చదువు ఆగిపోయిందని.అతడి భవిష్యత్తు నాశనం అవుతుందని అతడు పిటీషన్ వేసాడు.

అతడిని చదువు మాన్పించి బలవంతంగా పూజారిగా నియమించారని తెలిపాడు.ఈ పిటిషన్ ను న్యాయమూర్తులు పరిశీలిస్తున్నారు.

ప్రతిరోజూ 30నిమిషాలు నడిస్తే ఈ వ్యాధులకు చెక్

ఇక దీనిపై దేవాదాయశాఖ ను వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు కోరింది.మరి దీనిపై న్యాయమూర్తులు ఏం చెబుతారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు