హైద‌రాబాద్ వినాయ‌కుల‌కు హైకోర్ట్‌ షాక్‌

వినాయక విగ్రహాల ఎత్తు తగ్గించాలని ఉమ్మ‌డి రాష్ట్ర హైకోర్టు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేయ‌టంతో ఖైర‌తాబాద్‌తో స‌హా హైద‌రాబాద్ ప‌రిస‌ర ్ర‌పాంతాల‌లో ఈ సారి వినాయ‌క‌చ‌వితి ఉత్స‌వాల‌లో భారీ విగ్ర‌హాలు క‌నిపించ‌డం అనుమాన‌స్ప‌ద‌మేన‌నని స‌ర్వ‌త్రా విన‌వ‌స్తోంది.

భారీ ఎత్తునతో వినాయ‌క విగ్ర‌హాలు ఎక్క‌డి క‌క్క‌డ ఏర్పాటు చేయ‌టం వ‌ల్ల తరలింపులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, అనేక ర‌కాల రంగులు, కెమిక‌ల్్స‌తో త‌యారు చేస్తున్న విగ్ర‌హాల‌ను నీటిలో నిమ‌జ్జ‌నం చేయ‌టం వ‌ల్ల‌ పర్యావరణం దెబ్బతింటుందంటూ దాఖ‌లైన పిటిషన్ పై సోమ‌వారం హైకోర్టు విచార‌ణ జ‌రిపింది.

ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తులు .హైదరాబాద్‌లో పరిమితికి మించి విగ్రహాలు ఏర్పాటు జ‌రుగుతోంద‌న్న విష‌యం భాగ్య‌న‌గ‌ర్ ఉత్స‌వ క‌మిటీ గ‌మ‌నించాల‌ని, ప‌ర్య‌వ‌ర‌ణ ప‌రిమితుల దృష్ట్యా వినాయక విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించి ఉండరాదని ఆదేశించింది.విగ్రహాల ఎత్తు త‌గ్గించ‌డ‌మంటే హైదరాబాద్‌లో అభివృద్ధిని అడ్డుకోవడ‌మేనంటూ దుష్ప్ర‌చారం జ‌రుగుతుంద‌న్న పిటీష‌నర్ వాద‌న‌తోనూ ఏకీభ‌విస్తు, విగ్ర‌హాల ఎత్తు త‌గ్గంపు విష‌యంలో ప్ర‌భుత్వ‌మే చర్యలు తీసుకుని, వాటిని తెలపాలని హైకోర్టు ఆదేశించింది.

HC Orders For Size Limits Of Ganesh Pendils-HC Orders For Size Limits Of Ganesh

పూజా సామ‌గ్రి, ప్ర‌సాదాల‌ పైనా దృష్టి సారించిన హైకోర్టు మహారాష్ట్ర తరహాలో స్పెషల్‌ టిన్స్‌ ఏర్పాటు చేయాలని తెలిపింది దీంతో ఈ సారి భారీ వినాయ‌క విగ్ర‌హాలు అంతంత మాత్రం కానున్నాయ‌న‌టంలో సందేహం లేదు.ఇప్ప‌టికే ప్రారంభ‌మైన ఖైర‌తాబాద్ వినాయ‌కుడి నిర్మాణ‌ప‌నులు పూర్త‌వుతాయా అన్న‌ది అనుమాన‌మే.

అయితే హైకోర్ట్‌ ఆదేశాల‌పై సుప్రీం త‌లుపు త‌ట్టాల‌ని భాగ్య‌న‌గ‌ర్ ఉత్స‌వ స‌మితి ్ర‌ప‌గ‌టిస్తుండ‌గా, హైకోర్టు నిర్ణ‌యం స‌మంజ‌స‌మైన‌ద‌ని ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
టికెట్స్ వివాదం : సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?

తాజా వార్తలు