ఇది విన్నారా.. కుక్కపిల్లలకు బారసాల వేడుకలంట (వీడియో)

ఇప్పటి కాలంలో చాలామంది వారి ఇళ్లలో పెంపుడు జంతువులను ( Pets )పెంచుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.

పెంపుడు జంతువుల లాగా కుక్కలు, పిల్లులు, పక్షులు లాంటివి పెంచుకుంటూ వారి ఆలనా పాలనా చూస్తూ ఉంటారు.

అంతే కాకుండా, వాటికి సంబంధించిన ఏ చిన్న వేడుకైనా కానీ.చాలా వైభవంగా వేడుకలు( Celebrate in style ) నిర్వహిస్తూ ఉంటారు.

ఇందుకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే, అచ్చం అలాంటి ఒకటి ఘటన జగిత్యాల ( Jagityala )జిల్లాలో చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

మరి ఆ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళ్తే.వారు ఎంతగానో ఆప్యాయంగా పెంచుకుంటున్న కుక్కకు నాలుగు పిల్లలు జన్మనివ్వడంతో ఆ కుక్క పిల్లలకు బారసాల కార్యక్రమం నిర్వహించారు.ఈ క్రమంలో ఆ కుక్క పిల్లలకు కొత్త దుస్తులు తొడిగి ఉయ్యాలలో వేసి వేడుకలను నిర్వహించారు.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో సుభాష్ నగర్‌( Subhash Nagar in Metpally town ) ప్రాంతనికి చెందిన ఒక జంట షీడ్జూ జాతికి( Shiedzu breed ) చెందిన కుక్కను వారి ఇంట్లో పెంచుకుంటూ ఉన్నారు.ఈ క్రమంలో తాజాగా ఆ కుక్క నాలుగు పిల్లలకు జన్మనివ్వడంతో ఆ దంపతులు ఎంతో సంబరం పడిపోయి బారసాల కార్యక్రమం నిర్వహించారు.

అంతే కాకుండా చుట్టుపక్కల వారిని, బంధువులను పిలిచి మరి ఈ వేడుకలను నిర్వహించారు.ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.ఇక ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

కొందరేమో మంచి పని చేశారని కామెంట్ చేస్తుండగా.మరికొందరేమో, మితిమీరి ప్రవర్తిస్తున్నారని కాస్త ఘాటుగా స్పందిస్తున్నారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement

తాజా వార్తలు