అవును, మీరు విన్నది నిజమే.
నేటి టెక్నాలజీ యుగంలో( technology ) ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రభుత్వాలు హైటెక్ రోడ్లను నిర్మించే పనిలో ఉంటే, మనదగ్గర ఈ రోజుకీ కొన్ని రోడ్లు ఈసురోమంటూ చాలా దయనీయ పరిస్థితిలో వున్నాయి.
మరీ ముఖ్యంగా దేశంలో కొండ ప్రాంతాలోని రోడ్లు చాలా భయానకంగా ఉంటాయి.అయితే వీటకి భిన్నంగా ప్రపంచంలో ఒక రోడ్డు ఉంది.
అది రోజులో కేవలం 2 గంటలు మాత్రమే కనిపిస్తుంది.మిగిలిన సమయంలో అదృశ్యం అవుతుంది.
వినడానికి విడ్డురంగా వున్నా ఇది నిజమే.
ఇక ఈ రోడ్డు ఫ్రాన్స్‌లో( France ) ఉంది.ఈ రోడ్డు ప్రధాన భూభాగం నోయిర్ మౌటియర్ ద్వీపంతో( island of Noir Moutier ) కలుపుతుంది.ఫ్రాన్స్‌లోని అట్లాంటిక్ వద్ద వున్న ఈ రోడ్డు 4.5 కిలోమీటర్ల పొడవుని కలిగి వుంది.ఈ రోడ్డును పాసేజ్ డూ గోయిస్ పేరుతో పిలుస్తున్నారు.
ఫ్రెంచ్ భాషలో గోయిస్( Gois ) అంటే చెప్పులు విడిచి రోడ్డు దాటడం అని అర్థం.ఇది రోజులో ఒక గంట లేదా రెండు గంటలు మాత్రమే కనిపిస్తుందని సమాచారం.
మిగిలిన సమయంలో ఈ రోడ్డు నీటిలో మునిగిపోతుంది.ఆ సమయంలో రోడ్డుకు నలువైపులా నీరే కనబడడం కొసమెరుపు.
కాగా ఈ రోడ్డు దాటడం ఎంతో ప్రమాదకరం.రోజులో 2 గంటలు మాత్రమే ఎంతో పరిశుభ్రంగా కనిపించి, ఆ తరువాత మాయమైపోతుంది.అక్కడి నీటి లోతు 1.3 మీటర్ల నుంచి 4 మీటర్ల వరకూ ఏర్పడుతుంది.ఈ రోడ్డు మీదుగా ప్రయాణించే చాలామంది ప్రతీయేటా మృత్యువాత పడుతుంటారని వినికిడి.
మొదట్లో జనం ఈ ప్రాంతానికి బోట్లలో వచ్చేవారు.తరువాత ఇక్కడ రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు.1840లో గుర్రాల సాయంతో జనం ఇక్కడికి వచ్చేవారని ప్రతీతి.1986 తరువాత ఇక్కడ ప్రత్యేకమైన్ రేసులు నిర్వహిస్తూ వస్తున్నారు.1999 నుంచి ఫ్రాన్స్ ఈ రోడ్డుపై టూర్ ది ఫ్రాన్స్ పేరిట సైకిల్ రేసులు నిర్వహిస్తూ వస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy