Allu Arjun Ram Charan : బన్నీలో ఉన్న ఈక్వాలిటీ చరణ్ లో లేదు.. ఎప్పుడైనా గమనించారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ).

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan Tej ) వంటి వారు ఒకరు.వీరిద్దరు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఈ ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఇలా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమాలు ఎంతో మంచి సక్సెస్ కావడంతో వీరికి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు రావడమే కాకుండా విపరీతమైనటువంటి ఫాన్ ఫాలోయింగ్ లభించింది.ఇక అల్లు అరవింద్( Allu Aravind ) వారసుడుగా అల్లు అర్జున్ చిరంజీవి( Chiranjeevi ) వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి వచ్చి తండ్రిని మించిన తనయులుగా పేరు ప్రఖ్యాతలను పొందారు.

Have You Ever Noticed This Quality In Allu Arjun Not In Ram Charan

ఇక ఇద్దరు స్టార్ హీరోలుగా ఉన్న నేపథ్యంలో కొన్ని సందర్భాలలో ఈ హీరోల అభిమానుల మధ్య గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి.మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా గొడవ పడుతూ ఉంటారు.అయితే తాజాగా ఈ ఇద్దరు హీరోలకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అదేంటంటే అల్లు అర్జున్ లో ఉన్నటువంటి ఒక క్వాలిటీ రామ్ చరణ్లో లేదని తెలుస్తోంది.

Have You Ever Noticed This Quality In Allu Arjun Not In Ram Charan
Advertisement
Have You Ever Noticed This Quality In Allu Arjun Not In Ram Charan-Allu Arjun R

నటన పరంగా డాన్స్ పరంగా అభిమానులను సంపాదించుకోవడం పరంగా ఎటుచూసినా ఇద్దరు హీరోలు సమానంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు కానీ ఒక విషయంలో మాత్రం చరణ్ వెనుకబడిపోయారంటూ ఒక వార్త వైరల్ గా మారింది.అదేంటంటే చరణ్ ఎప్పుడూ కూడా ఎవరితోనో ఓపెన్ గా మాట్లాడరు ఎంతవరకు అవసరమో అంతే మాట్లాడతారు.ఇక ఆయనకు అన్ని విషయాలు అందరితో పంచుకోవడం ఇష్టం ఉండదు కానీ బన్నీ మాత్రం అలా కాదు చాలా ఓపెన్ మైండెడ్ తన మనసులో ఏముందో వెంటనే బయట పెట్టేస్తూ ఉంటారు.

ఇకపోతే అల్లు అర్జున్ కాస్త రొమాంటిక్ పర్సన్ అని కూడా చెప్పాలి ఈయన తన భార్యతో కలిసి చాలా రొమాంటిక్గా దిగినటువంటి ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు కానీ రామ్ చరణ్ మాత్రం అలా కాదు ఈయన ఎప్పుడూ కూడా ఉపాసనతో( Upasana ) కలిసి రొమాంటిక్ గా దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్న సందర్భాలు లేవు.ఇక తన భార్య ప్రెగ్నెంట్ అయినప్పుడు ఫ్రెండ్స్ సమక్షంలో పార్టీ జరగగా అక్కడ మాత్రమే కలిసి కాస్త రొమాంటిక్ గా ఫోటోలు దిగిన లిమిట్స్ దాటకుండా ఫోటోలు దిగారు.ఈ విషయంలో అల్లు అర్జున్ కంటే చరణ్ వెనకబడ్డారంటూ ఈ వార్త వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు