బాలీవుడ్ వాళ్ళకి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు.

ఇక అందులో భాగంగానే వాళ్ళు చేస్తున్న సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా వాళ్ళకంటూ పాన్ ఇండియాలో భారీ మార్కెట్ ను కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి.

మరి ఇలాంటి సందర్భంలోనే స్టార్ హీరోలు అయిన రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ (Ram Charan, Allu Arjun, Prabhas)లాంటి నటులు చేసే ప్రతి సినిమా పాన్ ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్నాయి.మరి ఏది ఏమైనా కూడా ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలే పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధిస్తున్నారు.

కాబట్టి ఇకమీదట కూడా మనవాళ్లే సత్తా చాటాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.కారణమేంటంటే ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీని చాలా నీచంగా చూసేది.

ఇక టాలీవుడ్ లో వచ్చే సినిమా మీద వాళ్లకు ఎలాంటి అభిప్రాయం లేదని అక్కడ ఓన్లీ కమర్షియల్ సినిమాలు మాత్రమే వస్తాయని చెబుతూ మనల్ని హేళన చేసేవారు.కానీ ఇప్పుడు రోజులు మారాయి.

Advertisement

మన సినిమాలే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాయి.మన దర్శకులు బాలీవుడ్ డైరెక్టర్స్ ను వెనక్కి నెట్టి నెంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్లిపోయారు.

కాబట్టి ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు.

బాలీవుడ్ ఇండస్ట్రీ లో మాఫీయా ఉంటుంది.కొన్ని సందర్భాల్లో తెలుగు సినిమా మీద కామెంట్లు చేసినప్పటికి ఇప్పుడు మాత్రం మన వాళ్ళు వరుస సినిమాలతో సమాధానం చెబుతున్నారు.ఇక ఇప్పటికే ఈ సంవత్సరం హనుమాన్, కల్కి, దేవర (Hanuman, Kalki, Devara)లాంటి సినిమాలు మంచి విజయాలను సాధించగా ఇప్పుడు పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ మరోసారి రంగం లోకి దిగుతున్నాడు.

తారా స్థాయికి చేరిన మంచు ఫ్యామిలీ గొడవలు... లక్ష్మి ప్రసన్న పోస్ట్ వైరల్!
Advertisement

తాజా వార్తలు