మాహేష్ - మురగదాస్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?

మురగదాస్ మాములు స్పీడ్లో లేడు.ఇంకా ఆరు నెలలు పడుతుంది మహేష్ తో సినిమా ప్రారంభం అవడానికి.

కాని ఇప్పటి నుంచే పనులు మొదలుపెట్టారు.అటు హీరోయిన్ తో పాటు సంగీత దర్శకుడు ఎవరు అనే చర్చలు జరుగుతున్నాయి.

ఒకవైపు హీరోయిన్ గా ఆలియా భట్ పేర్లు వినిపిస్తోంటే, మరోవైపు సంగీత దర్శకుడిగా అనిరుధ్, హారీస్ జయరాజ్ ల మధ్య పోటి నెలకొని ఉంది.అటు అనిరుధ్, ఇటు హారీస్ జయరాజ్, ఇద్దరు మురగదాస్ తో పనిచేసినవారే.

అయితే తాజా సమాచారం ప్రకారం, హారీస్ జయరాజ్ వైపు మురగదాస్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.హారీస్ జయరాజ్ ఇప్పటికే మాహేష్ సైనికుడు చిత్రానికి సంగీతం అందించారు.

Advertisement

అనిరుధ్ ఎక్కువగా బిజిగా ఉండటం, ఈ చిత్రానికి ఎక్కువ సమయం కేటాయించే సంగీత దర్శకుడు అవసరం ఉండటంతో గాలి హారీస్ వైపు వీచినట్లు తెలుస్తోంది.

ఈ పండ్లు ఆరోగ్యానికే కాదు జుట్టును ఒత్తుగా కూడా మారుస్తాయని తెలుసా?
Advertisement

తాజా వార్తలు