2024 ఎన్నికలకి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సీరియస్ నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతో( TDP ) పొత్తు ప్రకటించడం జరిగింది.
దాదాపు పది సంవత్సరాలు పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం.టీడీపీతో కలసి పనిచేయబోతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.
ఈ క్రమంలో జనసేన పార్టీకి ( Janasena ) చెందిన క్యాడర్ మొత్తం కష్టపడి పని చేయాలని కూడా ఎప్పటికప్పుడు సమావేశాలలో తెలియజేస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా కాపు నేత హరిరామజోగయ్య( Harirama Jogaiah ) సంచలన ప్రకటన చేశారు.
రాష్ట్రంలో జనసేన పార్టీకి ఎన్ని సీట్లకు పోటీ చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు.రాబోయే ఎన్నికలలో 57 సీట్లలో జనసేన పోటీ చేసేందుకు పరిశీలన జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.
వీటిలో 6 సీట్లలో పవన్ కోసం పరిశీలన జరుగుతుందని వెల్లడించారు.
ఆ ఆరు స్థానాలు వివరాలను కూడా వెల్లడించారు.పిఠాపురం, నరసాపురం, భీమవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, గాజువాక స్థానాలు తెలియజేశారు.రాబోయే ఎన్నికలలో ఈ స్థానాల నుంచి పవన్ పోటీ చేయొచ్చని.
హరిరామజోగయ్య లేఖ విడుదల చేయడం జరిగింది.
ఏది ఏమైనా 2014 ఎన్నికలలో గెలిచిన విధంగా 2024 ఎన్నికలలో( AP 2024 Elections ) గెలవాలని తెలుగుదేశం జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.కాగా డిసెంబర్ 20 నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకి పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు.ఈ సభ నుండి ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy