చంద్రబాబు చెంతకి హరికృష్ణ..ఎందుకో తెలుసా

తెలుగుగోడి సత్తా యావత్ భారతదేశానికి చాటి చెప్పిన అన్న నందమూరి తారకరామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి కేంద్రాన్ని గజగజ వణికించారు.

ఇప్పుడు కూడా ఏపీలో అదే పరిస్థితి నెలకొంది అన్న గారి తరువాత అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో గొప్ప పారు ప్రఖ్యాతలు సంపాదించారు.

మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత మోడీ పేరు దేశ వ్యాప్తంగా మారు మోగింది.మోడీ కే అందరు జై కొట్టారు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించాడు.

Harikrishna Re Join To TDP Reason Is…-Harikrishna Re Join To TDP Reason Is

ఈ సమయంలోనే తనకి ఎదురు చెప్పిన వారిని అణగదొక్కేవాడు కూడా అయితే మోడీ ని మొదటి సారిగా ఎదురొడ్డి నిలిచినది మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు మాత్రమే.యావత్ దేశం లో ఎవ్వరూ మోడీ ని ఎదిరించలేక సైలెంట్ గా ఉన్న తరుణం లో బాబు తీసుకున్న నిర్ణయాలు సంచలనకరంగా ఉంటున్నాయి.

చంద్రబాబు తనదైన శైలి లో రెచ్చిపోయి మంత్రుల్ని కేంద్రం నుంచి రాజీనామా చేయించి తన మార్కు రాజకీయం ఎన్డీయే లోంచి బయటకి వచ్చేశారు.చంద్రబాబు కి తెలివి ఎంత ఉందొ ఓర్పు కూడా అంతే.

Advertisement

అయితే తాజాగా బాబు తీసుకుంటున్న వరస సంచలన నిర్ణయాల తరవాత నందమూరి ఫామిలీ లో చలనం కనపడుతోంది తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కే అనేకసార్లు హ్యాండ్ ఇచ్చిన హరికృష్ణ ఇప్పుడు మళ్ళీ పార్టీ లోకి అడుగు పెట్టే ఆలోచన చేస్తున్నారు అని సమాచారం.టిడిపిలో వరుసగా రాజ్యసభ సభ్యుడుగా కంటిన్య‌స్‌ గా స్థానాన్ని కేటాయించే ఉంచారు.

వ్యవస్థాపకుడి వారసుడిగా ఆ మాత్రం మర్యాద ఇచ్చారు.కానీ.

అనుకోని కారణాల దృష్ట్యా పార్టీ కి దూరం అవ్వాల్సి వచ్చింది.ఇదిలాఉంటే బాబు యొక్క తాజా నిర్ణయాల తరవాత ఇప్పుడు హరికృష్ణ సైతం బాబు వైపు అడుగులు వేస్తున్నారు అని సమాచారం.

టీడీపీతో పవన్ కల్యాణ్ సంబంధాలు సరిగా ఉన్నప్పుడు పెద్దగా రియాక్ట్ కాని హరికృష్ణ.టీడీపీపై పవన్ విమర్శలు చేసిన రెండో రోజునే మీడియా ముందుకు రావటం చూస్తుంటే.

భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ సైతం సీన్లోకి తీసుకురావడానికి హరికృష్ణ ప్లాన్ లు వేస్తున్నట్టు ఉంది.అందుకే మళ్ళీ హరి కృష్ణ బాబు కి దెగ్గర వుతున్నారని టాక్.

Advertisement

తాజా వార్తలు