'వీరమల్లు' నుండి బర్త్ డే బ్లాస్ట్.. ఫ్యాన్స్ ఊహించని సర్ప్రైజ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

ఈయన బర్త్ డే ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ రోజు పవన్ కళ్యాణ్ తన 52వ పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ట్రీట్ కూడా భారీ లెవల్లో ప్లాన్ చేసారు.మరి ఎటువంటి అప్డేట్ లేకుండా పవన్ హరిహర వీరమల్లు( Hari Hara Veera Mallu ) నుండి అప్డేట్ వచ్చింది.

ఈ ఉహించని సర్ప్రైజ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ముందు నుండి భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఈ సినిమా ఆలస్యం కారణంగా ఫ్యాన్స్ లో అసంతృప్తి పెరిగింది.దీంతో ఈ సినిమాను పక్కన పెట్టి మిగతా సినిమాలపై ఫ్యాన్స్ ద్రుష్టి పెట్టారు.

ఏ ముహూర్తాన స్టార్ట్ అయ్యిందో తెలియదు కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు నిరాశ కలిగిస్తుంది.ఇప్పటికే 70 శాతం పూర్తి చేసిన ఈ సినిమా ఆ కొద్దిగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు.

Advertisement

కానీ పవన్ డేట్స్ లేని కారణంగా ఆగిపోయింది.ఇదిలా ఉండగా ఈ రోజు మాత్రం ఈ సినిమా నుండి సాలిడ్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.

పవన్ గడ్డం పెంచి ఇప్పటికే ఈ సినిమా కోసం కొన్ని సీక్వెన్స్ లు చేసిన విషయం తెలిసిందే.

అదే పోస్టర్ ను ఇప్పుడు పవన్ బర్త్ డే( Pawan Kalyan Birthday ) కానుకగా రిలీజ్ చేసారు.పవన్ సీరియస్ లుక్ లో హుందాగా నడిచి వస్తున్నట్టు కనిపించగా బ్యాక్ గ్రౌండ్ లో దెబ్బలతో పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు.అంటే పవర్ స్టార్ సీరియస్ ఫైట్ చేసినట్టు అనిపిస్తుంది.

మొత్తానికి ఈ ఊహించని పోస్టర్ అయితే అదిరిపోయింది అనే చెప్పాలి.ఇదిలా ఉండగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జంటగా నిధి అగర్వాల్ ( Nidhhi Agerwal )హీరోయిన్ గా నటిస్తుండగా.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీ రోల్ లో నటిస్తుంది.

Advertisement

చూడాలి అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎలాంటి హిట్ అందుకుంటుందో.

తాజా వార్తలు