'వీరమల్లు' కోసం డేట్స్ ఇచ్చిన పవన్.. అప్పటి నుండే షూట్ స్టార్ట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చేస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు ( vHari Hara Veera Mallu )ఒకటి.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియెన్స్ లో ఆసక్తి పోయేలా ఉంది.

ఎందుకంటే ఇది స్టార్ట్ అయ్యి మూడేళ్లు అవుతుంది.ఇంత వరకు షూట్ పూర్తి చేసుకోవడం కానీ సినిమా నుండి అప్డేట్ ఇవ్వడం కానీ మేకర్స్ చేయలేదు.

దీంతో ఈ సినిమాను మర్చిపోయేలా ఉన్నారు.

ఏ ముహూర్తాన స్టార్ట్ అయ్యిందో తెలియదు కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు నిరాశ కలిగిస్తుంది.ఇప్పటికే 70 శాతం పూర్తి చేసిన ఈ సినిమా ఆ కొద్దిగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు.కానీ పవన్ కూడా ముందు ప్రకటించిన ఈ సినిమాకు డేట్స్ ఇవ్వకుండా ఇటీవల ప్రకటించిన సినిమాకు డేట్స్ ఇస్తూ వాటిని పూర్తి చేస్తున్నాడు.

Advertisement

దీంతో ఈ సినిమా మాత్రం ఆగిపోతూనే ఉంది.కానీ తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ వైరల్ అయ్యింది.ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

సెప్టెంబర్ మొదటి వారం నుండి పవన్ వీరమల్లు కోసం డేట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది.ఈ సినిమా కోసం 10 రోజుల డేట్స్ ఇచ్చారట.

మరి ఇదే నిజమైతే ఈ సినిమా ఎట్టకేలకు ముందుకు కదిలినట్టే.ఇదిలా ఉండగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జంటగా నిధి అగర్వాల్( Nidhhi Agerwal Nidhhi ) హీరోయిన్ గా నటిస్తుండగా.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీ రోల్ లో నటిస్తుంది.

Advertisement

చూడాలి అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎలాంటి హిట్ అందుకుంటుందో.

తాజా వార్తలు