'హనుమాన్‌' మేకర్స్ నమ్మకం చూస్తుంటే ముచ్చటేస్తోంది

తేజ సజ్జా( Teja Sajja ) హీరో గా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం లో రూపొందిన చిత్రం హనుమాన్.

అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ సినిమా లో కీలక పాత్ర లో కనిపించబోతుంది.

ఈ సినిమా చిన్న హీరో తో రూపొందిన మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా.అయినా కూడా గుంటూరు కారం వంటి భారీ చిత్రం కు పోటీగా ఆ సినిమా విడుదల అవ్వబోతున్న రోజే విడుదల అవ్వబోతుంది.

సంక్రాంతి కానుకగా మహేష్ బాబు గుంటూరు కారం ( Guntur Kaaram )సినిమా జనవరి 12న విడుదల అవ్వబోతుండగా, అదే రోజున హనుమాన్‌ సినిమా విడుదల అవ్వబోతుంది అంటూ ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.తాజాగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు మరియు హీరో మాట్లాడుతూ పోటీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Hanuman Movie Teja Sajja And Prashanth Varma Comments , Teja Sajja, Hanuman Movi

మాది చిన్న సినిమా అవ్వచ్చు.చిన్న బడ్జెట్‌ అవ్వచ్చు.మా సినిమా లో పాన్ ఇండియా స్టార్‌ ను మించిన స్టార్‌ అయిన హనుమంతుడు ఉన్నాడు అంటూ నమ్మకంగా చెప్పారు.

Advertisement
Hanuman Movie Teja Sajja And Prashanth Varma Comments , Teja Sajja, Hanuman Movi

హనుమాన్‌ కాన్సెప్ట్‌ తో గతంలో రూపొందిన శ్రీ ఆంజనేయం సినిమా ను ఇప్పుడు కొందరు పోల్చుతున్నారు.ఈ నేపథ్యం లో హనుమాన్‌ సినిమా ఎలా ఉంటుందో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తూ ఉంటే దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మరియు తేజ మాత్రం మా సినిమా ఓ అద్భుతం అన్నట్లుగా టాక్ ను దక్కించుకోబోతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

Hanuman Movie Teja Sajja And Prashanth Varma Comments , Teja Sajja, Hanuman Movi

మొత్తానికి సినిమా కచ్చితంగా హిట్ అవ్వడం ఖాయం అని, గుంటూరు కారం( Guntur Kaaram ) సినిమా ఉన్నా కూడా ఓపెనింగ్స్ కాస్త తగ్గినా కూడా లాంగ్‌ రన్ లో సినిమా ఓ రేంజ్‌ లో వసూళ్లు దక్కించుకుంటుంది అంటూ వారు ధీమా తో ఉన్నారు.మరి ఫలితం ఎలా ఉంటుంది.సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు