భాగమతి దర్శకుడుతో వెబ్ సిరీస్ కి ఓకే చెప్పిన హాన్సిక

ప్రస్తుతం డిజిటల్ మీడియా హవా కొనసాగుతుంది.భవిష్యత్తు సినిమా అంతా డిజిటల్ లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కూడా సినిమాని డిజిటల్ లోకి తీసుకుపోతున్నాయి.మరో వైపు సినిమా ప్లేస్ లోకి వెబ్ సిరీస్ లు వచ్చి చేరుతున్నాయి.

Hansika Green Signal To Act In Web Series, Tollywood, Telugu Cinema, Kollywood,

డిఫరెంట్ కంటెంట్ తో కొత్తదనంతో చాలా మంది దర్శకులు ఓటీటీ మీడియా సంస్థలని మెప్పించి వెబ్ సిరీస్ లు తెరకెక్కిస్తున్నారు.వెబ్ సిరీస్ లకి కమర్షియల్ హంగుల కంటే కంటెంట్ ప్రాధాన్యత ఉంటుంది.

వీటిని చూసే ఆడియన్స్ కూడా ఎక్కువగా కంటెంట్ నే కోరుకుంటారు.దీంతో కొత్తదనం ఇష్టపడే దర్శకులు వెబ్ సిరీస్ ల బాట పడుతున్నారు.

Advertisement

అలాగే హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు.సినిమాల పరంగా కెరియర్ చివరి దశకి వచ్చేసిన అందాల భామలు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు వెబ్ సిరీస్ లని ఎంచుకుంటున్నారు.

అక్కడ భవిష్యత్తు నిర్మించుకోవడానికి రెడీ అవుతున్నారు.ఇప్పటికే బాలీవుడ్ భామలు ఈ దారిలో వెళ్ళగా ఇప్పుడు సౌత్ భామలు కూడా ఇదే దారి ఎంచుకుంటున్నారు.

ఇప్పటికే ప్రియమణి, సమంత, కాజల్, తమన్నా వెబ్ సిరీస్ లలో నటించడానికి ఒకే చెప్పేశారు.ఇప్పుడు ఈ దారిలో హాన్సిక కూడా వచ్చి చేరింది.

ఈ అమ్మడు భాగమతి ఫేం అశోక్ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కే వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైపోయిందని, ఓ ప్రముఖ చానల్ లో త్వరలో టెలికాస్ట్ అవుతుందని తెలుస్తుంది.

అందమైన ముఖ చర్మానికి పాల పేస్ పాక్స్
Advertisement

తాజా వార్తలు