కాలం కదల్లేని స్థితిలో పడేస్తే సంకల్పంతో సివిల్స్.. హనిత సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి.ఏపీలోని వైజాగ్ కిర్లంపూడి లేఅవుట్ ప్రాంతానికి చెందిన వేములపాటి హనిత( Vemulapati Hanita ) తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు.

హనిత చిన్నప్పటి నుంచి చదువులో టాపర్ గా ఉండేవారు.2012లో జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించిన హనిత పెరాలసిస్ స్ట్రోక్ ( Paralysis stroke )వల్ల వీల్ ఛైర్ కు పరిమితం అయ్యారు.ఊహించని పరిణామం వల్ల ఆమె మానసికంగా క్రుంగిపోయారు.

పేరెంట్స్, ఫ్రెండ్స్ సపోర్ట్ తో దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేసిన ఆమె పేరెంట్స్, టీచర్స్ సపోర్ట్ తో కెరీర్ పరంగా సక్సెస్ కావాలని భావించారు.ఇంటినుంచి సివిల్స్ ప్రిలిమ్స్ కోసం హనిత ప్రిపేర్ అయ్యారు.

సొంతంగా మెటీరియల్ తయారు చేసుకున్నారు.తొలి మూడు ప్రయత్నాలలో ఫెయిల్ అయిన హనిత నాలుగో ప్రయత్నంలో సక్సెస్ సాధించడం గమనార్హం.

Hanitha Inspirational Success Story Details Here Goes Viral In Social Media , S

2020 సంవత్సరంలో తొలిసారి హనిత యూపీఎస్సీ సివిల్స్( UPSC Civils ) కోసం ప్రిపేర్ కావడం జరిగింది.2023 సివిల్స్ ఫలితాలలో హనిత జాతీయ స్థాయిలో 887వ ర్యాంక్ ను సాధించడం గమనార్హం.ప్రస్తుతం మానసిక ఆస్పత్రిలో ఏవోగా పని చేస్తున్న హనిత సివిల్స్ లో మంచి ర్యాంక్ రావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పుకొచ్చారు.

Advertisement
Hanitha Inspirational Success Story Details Here Goes Viral In Social Media , S

ధైర్యంతో ముందుకెళ్తే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం సులువేనని ఆమె చెబుతున్నారు.

Hanitha Inspirational Success Story Details Here Goes Viral In Social Media , S

చీకటి వెంటే వెలుగు ఉంటుందని గుర్తుంచుకోవాలని అంకిత భావంతో కృషి చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆమె పేర్కొన్నారు.అమ్మ, నాన్న సపోర్ట్ ను మరవలేనని ఆమె చెప్పుకొచ్చారు.హనిత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

ఆరోగ్య సమస్యలు ఉన్నా సక్సెస్ సాధించిన హనిత ప్రశంసలు అందుకుంటున్నారు.ఆమె సక్సెస్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు చెబుతున్నారు.

బాన పొట్టను 20 రోజుల్లో ఫ్లాట్ గా మార్చే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!
Advertisement

తాజా వార్తలు