కరోనా నుంచి రక్షించే చేనేత మాస్క్..!

కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అలాంటి కరోనా వైరస్ నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే మనం కచ్చితంగా మాస్కు, శానిటైజర్ తప్పక ఉపయోగించాలి.

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ నుండి చేనేత మాస్కు కూడా రక్షిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

Handloom Face Masks Are Safe, Handloom Masks, Safe, Coronavirus, Covid-19-కర

సాధారణంగా కరోనా వైరస్ నుండి మనల్ని రక్షించేందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 రకాల మాస్కులు ఉన్నాయి.ఇంకా అన్ని మాస్కులలో ఏది మనల్ని రక్షిస్తుందన్న దానిపై అమెరికాలోని డ్యూక్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశోధనలు చెయ్యగా అందులో ఓ అద్భుతమైన విషయం బయటకు వచ్చింది.ఎన్‌95 మాస్కులు, సర్జికల్ ‌మాస్కులు మాత్రమే కాకుండా నూలు పోగుతో చేసిన చేనేత మాస్కులు కూడా కరోనా నుండి సురక్షిస్తాయని వైద్యులు తేల్చారు.ఇంకా టవల్, మఫ్లర్ లాంటి ఏ వస్త్రాలు కూడా మనల్ని కరోనా నుండి రక్షించలేవు అని.వాటిని కట్టుకున్న ఎలాంటి ఫలితము ఉండదని వైద్యులు గుర్తించారు.అందుకే ఖర్చు అయినా కూడా ఎన్‌95 మాస్కులు, సర్జికల్ ‌లేదా చేనేత మాస్కులు ఉపయోగించడం మంచిది.

జాయింట్ పెయిన్స్‌తో బాధ‌ప‌డుతున్నారా..అయితే ఇవి తీసుకోవాల్సిందే.!
Advertisement

తాజా వార్తలు