OSD Harikrishna : హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీ హరికృష్ణకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్ లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీ హరికృష్ణకు( OSD Harikrishna ) తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో హరికృష్ణ సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తనను సస్పెండ్ చేయడాన్ని హరికృష్ణ హైకోర్టులో( High Court ) సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం సస్పెండ్ చేసే అధికారం మంత్రికి లేదని తేల్చి చెప్పింది.

అలాగే కమిటీ విచారణలో ఆరోపణలు కూడా రుజువు కాకపోవడంతో హరికృష్ణ సస్పెన్షన్ ను హైకోర్టు ఎత్తివేసింది.

ఏఎన్నార్ ఒత్తిడితో మెగాస్టార్ సినిమా వదిలేసిన కోదండరామిరెడ్డి
Advertisement