ప్రేమ జంటపై దాడిలో మిస్టరీ ఛేదించిన పోలీసులు! ప్రియుడే హంతకుడు!

మంగళగిరిలో ప్రేమజంట పై దుండగుల దాడి ఘటన వెనుక నిజాలను పోలీసులు ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ముందుగా ఈ విచారణలో కొంత నిర్లక్ష్యం జరిగినట్లు వార్తలు వినిపించడంతో ఈ కేసు విచారణ జిల్లా అర్బన్ ఎస్పీ నేరుగా చేయడానికి రెడీ అయ్యారు.

తాజాగా ఈ ప్రేమజంటపై దాడి లో అమ్మాయి జ్యోతి మర్డర్ మిస్టరీని ఛేదించే ప్రయత్నం పోలీసులు చేశారనే చెప్పాలి.జ్యోతి కుటుంబసభ్యులు గత ఐదు రోజులుగా ఆమె మరణానికి శ్రీనివాస కారణం అని గట్టిగా నొక్కి చెబుతూ ఆందోళన చేస్తున్నారు.

అయితే ఇన్ని రోజులు బంధువుల ఆరోపణలపై పెద్దగా దృష్టి పెట్టని పోలీసులు తాజాగా శ్రీనివాస రావును హాస్పిటల్లో విచారించే ప్రయత్నం చేశారు.అయితే శ్రీనివాసరావు చెబుతున్న మాటల్లో ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉండడంతో అతనే హత్య చేసి ఉంటాడని అభిప్రాయానికి పోలీసులు వచ్చారు.

జ్యోతి శ్రీనివాసరావు పెళ్లి చేసుకోమని గట్టిగా నిలదీయడంతోనే ఆమెను నమ్మించి తీసుకెళ్లి స్నేహితుల సహాయంతో హత్య చేశాడని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.గతంలో కూడా శ్రీనివాసరావు ఇలాగే కొంత మంది అమ్మాయిలను జ్యోతి హత్య చేసిన స్థలానికి తీసుకెళ్లి నగ్న వీడియోలు చిత్రీకరించినట్లు పోలీసుల విచారణలో తేలడంతో జ్యోతిని శ్రీనివాసరావు హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు.

Advertisement

ఇక అతనికి సహకరించిన ఇద్దరు స్నేహితులు అదుపులోకి తీసు కుంటే పూర్తి విషయాలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది.మరి గుంటూరు పోలీసులు జ్యోతి మర్డర్ వెనుక ఎలాంటి వాస్తవాలు బయటపెడతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Betway: Practical Guide To Player Safety And Responsible Gambling
Advertisement