భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాటు తుపాకీ కలకలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాటు తుపాకీ కలకలం సృష్టించింది.మద్యం మత్తులో భార్యపై తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు భర్త.

జూలూరుపాడు మండలం పుల్లూడుతండాలో ఈ ఘటన చోటు చేసుకుంది.మద్యానికి బానిసైన భర్త శ్యామ తరుచూ భార్య శాంతిపై ఘర్షణకు పాల్పడేవాడు.

ఇదే తరహాలో నిన్న రాత్రి మద్యం సేవించి వచ్చిన శ్యామ గొడవకు దిగాడు.అనంతరం శాంతి కిరాణ దుకాణానికి వెళ్లి వస్తుండగా వెనుక నుంచి కాల్పులు జరిపాడు.

అనంతరం అక్కడి నుంచి పరార్ అయ్యాడు.స్థానికులు బాధితురాలిని వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

కాగా ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తుపాకీ తయారీదారుడిని అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు నిందితుడు శ్యామ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు