గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జిగ్నేష్ మేవానీకి అహ్మదాబాద్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది.
2016లో కోర్టు మెవానీతో సహా 19 మందికి నమోదైన కేసుపై శుక్రవారం హైకొర్టు తీర్పు చేప్పింది.గుజరాత్ యూనివర్శిటీలోని లా డిపార్ట్‌మెంట్ పేరును డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్‌గా మార్చాలనే డిమాండ్ సందర్భంగా జరిగిన ఆందోళనలో సమయంలో పలు హింసాత్మక ఘటనలు జరిగాయి.
ఈ సమయంలో పలువురు నాయకులపై కేసు నమోదైంది.ఈ కేసులో 20 మందిని నిందితులుగా చేర్చగా, అందులో ఒకరు మరణించారు.
ఎమ్మెల్యేలు జిగ్నేష్ మేవానీ, సుబోధ్ పర్మార్, రాకేష్ మెహ్రియా సహా 19 మందికి అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం ఆరు నెలల జైలు శిక్ష విధించింది.అలాగే ఈడీ కేసులో నమోదైన మూడు కేసుల్లో కోర్టు శిక్షలు ఖరారు చేసింది.మొదటి కేసులో 6 నెలల జైలు శిక్ష, రెండో కేసులో రూ.500, మూడో కేసులో రూ.100 జరిమానా విధించారు.త్వరలో గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
పార్టీ మధ్య విమర్శల పర్వం కొనసాగుతుంది.ఇక దేశ రాజకీయ సంచలనం ఆప్ కూడా గుజరాత్ ఎన్నికల బరిలో దిగబోతుంది.
ఈ ఏడాది చివర్లో గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రంలో పలుమార్లు పర్యటించారు.అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఉద్యోగాలు, ఉచిత విద్యుత్, నీరు, వైద్యం, విద్య రంగాల్లో సంస్కరణలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
ఆప్‌ని బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా చూపించేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు.
2017 ఎన్నికలలో గుజరాత్‌లో అనేక స్థానాల్లో AAP పోటి చేసింది, అయితే ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.కొన్ని స్థానాల్లో ప్రధాన పార్టీలకు గట్టి పోటీని ఇచ్చింది.ఈ ఎన్నికల్లో 182 సీట్లకు గాను 77 సీట్లు గెలుచుకుని బీజేపీకి గట్టి సవాల్ విసిరింది కాంగ్రెస్.
ఉత్కంఠ రేపిన పోరులో బీజేపీ 99 స్థానాల్లో విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి వచ్చింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy