డాన్స్ చేస్తూ స్టేజీ పైనే పెళ్ళికొడుకు మృతి ..!

పెళ్లంటే నూరేళ్ళ పంట. జీవితంలో ఒక్కసారే జరిగే వైభవం.

జీవిత భాగస్వామితో వేసే ప్రతీ అడుగు ప్రత్యేకంగా ఉండాలని జంటలు కోరుకుంటారు.

జీవితాంతం గుర్తుండిపోయేలా పెళ్లి అనుభూతులు ఉండాలని.

కొన్ని జంటలు ప్రయత్నిస్తుంటాయి.అందుకోసం వివాహాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా జరుపుకుంటున్నారు.

ఐతే అలాంటి పెళ్లి వేడుకల్లోనే ఒక్కోసారి అనూహ్య ఘటనలు జరుగుతుంటాయి.ఆనందోత్సహాల మధ్య కళకళలాడుతున్న పెళ్లింటి విషాదం నెలకొన్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.

Advertisement

తాజాగా గుజరాత్‌ లోని సూరత్‌లో కూడా ఇలాంటి షాకింగ్ ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.తన పెళ్లి వేడుకలో డీజీ పాటలకు డ్యాన్స్ చేస్తూ వరుడు కుప్పకూలాడు.

ఫ్రెండ్స్‌తో కలిసి ఆటపాటలతో సందడి చేస్తున్న సమయంలో గుండెపోటుతో మరణించాడు.పెళ్లికి కొద్ది గంటల ముందేఈ విషాదం చోటుచేసుకుంది.పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.

సూరత్ జిల్లా మాండ్వి మండలం అరేత్ గ్రామానికి మితేష్ భాయ్ చౌదరి (33)కి శనివారం వివాహం జరగాల్సి ఉంది.వివాహానికి ముందు జరగాల్సిన అన్ని కార్యక్రమాలు ముగిశాయి.

ఇక వరుడు తన ఇంటి నుంచి వధువు ఇంటికి వెళ్లాలి.ఇందుకు గాను డీజే పాటలతో ఊరేగింపు ఏర్పాటు చేశారు.

ల‌వ్ లో ఉండ‌గా... టెలిగ్రామ్ పంపిన అనుభూతి.! ఇప్ప‌టికీ ఆ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ యా ఆయ‌న న‌న్ను ఆట‌ప‌ట్టిస్తుంటారు.!

మితేష్‌, తన స్నేహితులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్‌ చేసుకుంటూ.ఊరేగింపులో పాల్గొన్నాడు.

Advertisement

డ్యాన్స్‌ చేస్తూ.అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా కనిపించిన మితేష్.

ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.గుండె పోటుతో చూస్తుండగానే కిందపడిపోయాడు.

మితేష్‌లో ఎలాంటి కదలిక లేకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కంగారుపడ్డారు.హుటాహుటిన బైక్‌పై అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.అక్కడ నుండి వేరే ఆస్పత్రికి తరలించారు.

మితేష్‌ని పరీక్షలు చేసిన వైద్యులు.అప్పటికే అతడు మరణించినట్లు వెల్లడించారు.

డాక్టర్లు ఆ మాట చెప్పడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా షాక్ తిన్నారు.అప్పటి వరకు తమతో పాటు ఆడిపాడిన మితేష్.

మరణించడమేంటని శోకసంద్రంలో మునిగిపోయారు.పెళ్లికి కొన్ని గంటల ముందే ఈ ఘటన జరగడంతో వధువు ఇంట్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.