మొటిమ‌లు ఉన్నవారు గ్రీన్ టీ తాగితే ఏం అవుతుందో తెలుసా?

టీనేజ్ నుండి ప్రారంభం అయ్యే ఈ మొటిమ‌లు ఎంత‌గా ఇబ్బంది పెడ‌తాయో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఆయిల్ స్కిన్ ఉన్న వారు ఈ మొటిమ‌ల స‌మ‌స్యను మ‌రింత ఎక్కువ‌గా ఫేస్ చేస్తుంటారు.

ఇక ముఖ్యంగా అమ్మాయిలు మొటిమ‌లు అంటేనే భ‌య‌ప‌డిపోతుంటారు.పొర‌పాటున ఒక్క మొటిమ వ‌చ్చినా.

దానిని త‌గ్గించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ఏవేవో ఫేస్ ఫ్యాక్‌లు ట్రై చేస్తుంటారు.

అయిన‌ప్ప‌టికీ త‌గ్గ‌కుంటే బాధ ప‌డుతుంటారు.అయితే కేవ‌లం ఫేస్ ఫ్యాక్‌లే కాదు కొన్ని కొన్ని ఆహారాలు తీసుకోవ‌డంతోనూ మొటిమ‌ల‌ను నివారించుకోవ‌చ్చు.

Advertisement

అలాంటి వాటిలో గ్రీన్ టీ ఒక‌టి.అవును, గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల మొటిమ‌ల‌ను త‌గ్గుతాయి.

సాధార‌ణంగా చాలా మంది అధిక బరువును త‌గ్గించుకునేందుకు గ్రీన్ టీని ఎంచుకుంటారు.కానీ, గ్రీన్ టీ బ‌రువును త‌గ్గించ‌డానికే కాదు.

మ‌రిన్ని విధాలుగా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.ముఖ్యంగా సౌంద‌ర్య ప‌రంగా గ్రీన్ టీ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

మొటిమ‌లు ఉన్న వారు ప్ర‌తి రోజు ఉద‌యాన్నే కొద్దిగా తేనె కలుపుకుని ఒక కప్పు వెచ్చని గ్రీన్ టీ తాగండి.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

ఇలా గ్రీన్ టీ సేవించ‌డం వ‌ల్ల.అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీబయాటిక్ మ‌రియు యాంటీ మైక్రోబియల్ కాంపౌండ్స్ మొటిమ‌ల‌ను క్ర‌మంగా త‌గ్గిస్తుంది.గ్రీన్ టీ తాగ‌డంతో పాటుగా.

Advertisement

మొటిమ‌లు ఉన్న ప్రాంతంలో చల్లటి గ్రీన్ టీ బ్యాగుని ఉంచితే మ‌రింత వేగంగా మొటిమ‌లు త‌గ్గుతాయి.ఇక గ్రీన్ టీను రెగ్యుల‌ర్‌గా తాగ‌డం వ‌ల్ల చర్మంపై వచ్చే ముడతలు, సన్నని గీతలు వంటివి కూడా పోయి.

య‌వ్వ‌నంగా మారుతుంది.అలాగే చర్మానికి గ్రీన్ టీ ఓ టోనర్ గా పనిచేస్తుంది.

చర్మంలోని తేమను బయటికి పోకుండా ర‌క్షిస్తుంది.అదే స‌మ‌యంలో చర్మ లో దాగి ఉన్న అన్ని రకాల టాక్సిన్స్ ను బయటకు సులువుగా పంపడానికి కూడా సహాయపడుతుంది.

కాబ‌ట్టి, తాము అందంగా, య‌వ్వ‌నంగా, మొటిమ‌లు లేకుండా క‌నిపించాలి అని అనుకునే వారు త‌ప్ప‌కుండా ఓ క‌ప్పు గ్రీన్ టీ తీసుకోవ‌డం మాత్రం అస్స‌లు మ‌ర‌వ‌కండి.

తాజా వార్తలు