గ్రేప్స్‌ను ఈ విధంగా తీసుకుంటే గుండె జ‌బ్బులకు దూరంగా ఉండొచ్చు!

గ్రేప్స్‌. రుచిగా ఉండ‌ట‌మే కాదు విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోష‌కాలను మెండుగా క‌లిగి ఉంటాయి.

అందుకే ఆరోగ్య ప‌రంగా గ్రేప్స్ ఎంత‌గానో మేలు చేస్తాయి.అయితే గ్రేప్స్‌ను డైరెక్ట్ గా కాకుండా ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా తీసుకుంటే మ‌రిన్ని పోష‌కాల‌ను, ప్ర‌యోజ‌నాల‌ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.

మ‌రి లేటెందుకు అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.ముందుగా ఒక క‌ప్పు సీడ్ లెస్ గ్రేప్స్‌ను ఉప్పు నీటిలో శుభ్రంగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్‌, రెండు టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగ‌ర్‌, నాలుగు గింజ తొల‌గించిన ఖ‌ర్జూరాలు, మూడు పొట్టు తీసిన బాదం ప‌ప్పులు, నాలుగు పిస్తాలు, ఐదు ఎండు ద్రాక్ష‌లు, వ‌న్ గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్, రెండు మూడు ఐస్ క్యూబ్స్‌ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.అప్పుడు గ్రేప్స్ మిల్క్ షేక్ సిద్ధం అవుతుంది.

Advertisement

ఈ హెల్తీ అండ్ టేస్టీ మిల్క్ షేక్‌ను త‌ర‌చూ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.ముఖ్యంగా ఈ గ్రేప్స్ మిల్క్ షేక్‌లో ఉండే అద్భుత‌మైన పోష‌కాలు బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను క‌రిగించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

త‌ద్వారా గుండె జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చు.ఈ గ్రేప్స్ మిల్క్‌ షేక్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా నిండి ఉంటాయి.అందువ‌ల్ల‌, వారంలో క‌నీసం రెండు సార్లు దీన్ని తీసుకుంటే ఇమ్యూనిటీ సిస్ట‌మ్ బూస్ట్ అవుతుంది.

శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా ఉంటాయి.ఏజింగ్ ప్రాజెస్ ఆల‌స్యం అవుతుంది.

అలాగే గ్రేప్స్‌ను పైన చెప్పిన విధంగా తీసుకుంటే నీర‌సం, అల‌స‌ట వంటివి ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి మాన‌సిక స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?

మ‌రియు ఎముక‌లు దృఢంగా కూడా మార‌తాయి.

Advertisement

తాజా వార్తలు