రజనీకాంత్ కు గవర్నర్ పదవి ! మోదీ ఒకే.. అమిత్ షా నో ?

దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఎగరవేయాలని బిజెపి కంకణం కట్టుకుంది.దీనిలో భాగంగానే ఒక్కో రాష్ట్రంలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి బలహీనంగా ఉండడంతో, ఆ పార్టీ అగ్ర నేతలు ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు.ఆంధ్ర - తెలంగాణ తో పాటు తమిళనాడు లో బిజెపి జెండా ఎగురవేసేందుకు అవసరమైన రాజకీయ వ్యూహాలను రచిస్తున్నారు.

దీనిలో భాగంగానే తమకు కలిసి వచ్చే అన్ని అంశాల పైన దృష్టి పెట్టారు.ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న క్రేజ్ ను, ఆయన అభిమానులను తమ వైపుకు తిప్పుకునే వ్యూహంలో భాగంగా ఆయనను బిజెపిలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం.

దీనిలో భాగంగానే రజనీకాంత్ కు గవర్నర్ పదవి ఇచ్చేందుకు బిజెపి సిద్దమైనట్లు సమాచారం.గత కొద్ది రోజులుగా దీనిపై హడావుడి జరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ రవితో రజనీకాంత్ బేటి అయ్యారు.

Advertisement

ఈ సందర్భంగా అనేక రాజకీయ అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది.అయితే దానికి సంబంధించిన వివరాలు చెప్పేందుకు రజనీకాంత్ నిరాకరించారు.

అలాగే బిజెపి అగ్రనేతలతోనూ రజనీకాంత్ సమావేశం అయ్యేందుకు సిద్ధమవుతుండడంతో, తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.గతంలో రజనీకాంత్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.

పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత పార్టీ పేరును ప్రకటిస్తారు అనుకుని అంతా ఎదురు చూస్తుండగా ఆయన తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని , తన ఆరోగ్యం , వయస్సు రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించడంతో , ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.ఈ క్రమంలోనే ఇప్పుడు బిజెపి ఆయనకు గవర్నర్ పదవి ఇచ్చేందుకు సిద్ధమవుతుండడం ఆసక్తికరంగా మారింది.ఇది ఇలా ఉంటే రజనీకాంత్ కు గవర్నర్ పదవి ఇచ్చే విషయంలో ప్రధాన నరేంద్ర మోదీ సానుకూలంగా ఉండగా, అమిత్ షా మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

కానీ రజనీకాంత్ వంటి విశేష ప్రజాదరణ ఉన్న వ్యక్తికి కనుక పదవి ఇస్తే తమిళనాడు రాజకీయాల్లో బిజెపి ప్రభావం పెరుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.

ఎక్కిళ్ళు ఎందుకు వ‌స్తాయి.. వాటిని ఆప‌డం ఎలా..?
Advertisement

తాజా వార్తలు