గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.తాను బీజేపీలో లేనన్న ఆయన బండి సంజయ్ ఫాలోవర్ గా మాట్లాడుతున్నా అని చెప్పారు.

పాదయాత్ర అంటే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.కేసీఆర్ కు బీజేపీ అంటే భయమా.? బండి సంజయ్ అంటే భయమా.? అని ప్రశ్నించారు.కేసీఆర్ నిజాం పాలన చేయాలని చూస్తే బండి సంజయ్ చేయనివ్వరని తెలిపారు.

బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇచ్చి తీరాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.ఎప్పుడూ ఒక్కరూ అధికారంలో ఉంటారని పోలీసులు అనుకోకూడదన్నారు.

బండి సంజయ్ టర్మ్ వచ్చాక మేమేంటో పోలీసులకు చూపిస్తామని వెల్లడించారు.

Advertisement
ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?

తాజా వార్తలు