Bhimaa Movie Review : భీమా రివ్యూ అండ్ రేటింగ్?

మ్యాచో స్టార్ గోపీచంద్( Gopichand ) తాజాగా భీమా( Bhimaa )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

కన్నడ స్టార్ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన మాళవిక శర్మ, ప్రియా భవాని శంకర్ హీరోయిన్లుగా నటించారు.

ఇక ఈ సినిమాని కేకే రాధా మోహన్ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించారు.ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇదివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి ట్రైలర్ టీజర్ అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకోవడంతో భీమా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.నేడు మార్చి 8వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుని ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే.

కథ:

భీమా (గోపీచంద్) తనదైన స్టైల్ లో క్రిమినల్స్ ని పట్టుకుని వారి ఆట కట్టించే పోలీస్ అధికారి.అయితే మహేంద్రగిరిని ఏలుతున్న భవాని (ముకేశ్ తివారి) కి( Mukesh Tiwari ) అతడు పెద్ద సమస్యగా మారిపోతాడు.

Advertisement

ఇలా పోలీస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఈయన స్కూల్ టీచర్ గా పని చేస్తున్నటువంటి విద్యతో ప్రేమలో పడతారు.అయితే తన మందులతో ఎందరినో కాపాడుతున్న రవీంద్ర వర్మ (నాజర్)( Nassar ) అంటే విద్యకు అమితమైన గౌరవం ఉంటుంది.

అనంతరం భీమాని రవీంద్ర వర్మ ఒక పనిచేయమని కోరుతాడు ఆ పనే అన్ని వివాదాలకు కారణం అవుతుంది.మహేంద్రగిరి ఊరిలో భవాని(ముఖేష్ తివారి) ఎదురులేని శక్తిగా ఉంటాడు.

అతడిని ప్రశ్నిస్తే ఎంతటి వారినైనా వదలడు.ప్రభుత్వ అధికారులు అయినా అతనికి లెక్కలేదు ఇలాంటి ఊరికి ఈయన పోలీస్ అధికారిగా వస్తారు.వచ్చీ రావడంతోనే భవానీతో పెట్టుకుంటాడు.

అతనికి తనదైన స్టైల్లో మాస్ వార్నింగ్ కూడా ఇస్తాడు.ప్రకృతి వైద్యుడు రవీంద్ర వర్మ(నాజర్) ఎవరు? పారిజాతం(ప్రియా భవానీ శంకర్) ఎవరు? విద్య(మాళవికా శర్మ)( Malavika Sharma ) వల్ల గోపీచంద్ లైఫ్ ఎలా మారింది? మహేంద్రగిరిలోని పరుశురామ క్ష్రేత్రంలో ఉన్న శివాలయం 5 దశాబ్దాలుగా ఎందుకు మూతబడి ఉంది అనే విషయాలపై ఈ సినిమా కథ నడుస్తుంది.

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్... వీడియో వైరల్...
ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 

నటీనటుల నటన:

చాలా రోజులుగా ఇలాంటి హిట్ లేనటువంటి గోపీచంద్ కు ఇది మంచి కం బ్యాక్ సినిమా అని చెప్పాలి.ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో గోపీచంద్ చాలా అద్భుతంగా నటించారు.ముఖ్యంగా పరుశురామ క్షేత్రం సన్నివేశాలు హైలైట్ అనిపించాయి.

Advertisement

ఇక మాళవిక శర్మ, ప్రియా భవాని శంకర్( Priya Bhavani Shankar ) నాజర్ 21 వారందరూ కూడా వారి పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.

టెక్నికల్:

మంచి యాక్షన్ సీన్స్, విజువల్స్ తో కూడిన కథగానే భీమా కూడా సాగుతుంది.సినిమాటోగ్రఫీ అందించిన స్వామి జె గౌడ అద్భుతంగా పని చేసారు.ముఖ్యంగా రాత్రిపూట వచ్చే సన్నివేశాలు చాలా అద్భుతంగా చూపించారు.

రవి బస్రూర్( Ravi Basrur ) మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి.మంచి మాస్ సినిమాకి కావాల్సిన యాక్షన్ సీన్స్ బీమాలో బాగా సెట్ అయ్యాయి.

యాక్షన్ తో కూడిన కథలో మంచి ఫాంటసీ ఎలిమెంట్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు నిర్మాణాత్మక విలువలు కూడా బాగున్నాయి.

విశ్లేషణ:

మొత్తంగా గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ భీమా చూడగలిగే యాక్షన్ మాస్ డ్రామా మూవీ అని చెప్పాలి.గోపీచంద్ స్క్రీన్ ప్రెజెన్స్, నటన మరియు ఫాంటసీ ఎలిమెంట్.ఇక ఇందులో గోపీచంద్ యాక్షన్ క్లైమాక్స్ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి.

అక్కడక్కడ కామెడీ సన్నివేశాలను పండించారు ఫస్ట్ హాఫ్ కంటెంట్ సెకండ్ హాఫ్ హైలెట్ గా నిలిచింది మొత్తానికి గోపీచంద్ చాలా రోజుల తర్వాత ఓ మంచి యాక్షన్ మూవీ తన కటౌట్ కి సరిపడా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్:

గోపీచంద్ నటన, మ్యూజిక్, క్లైమాక్స్, యాక్షన్ సన్ని వేషాలు

మైనస్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా సాగటం, అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు చాలా బోర్ కొట్టేలాగా ఉన్నాయి.

బాటమ్ లైన్:

చాలా రోజుల తర్వాత గోపీచంద్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇరగదీసాడు.ఈ సినిమా చూస్తున్నంత సేపు సరదాగా సాగిపోతుంది.

కానీ మరీ ప్రేక్షకులు థియేటర్లలో కూర్చొని విధంగా సినిమా లేదు మొత్తానికి గోపీచంద్ నటనతో మెప్పించారు.

రేటింగ్: 2.75/5

తాజా వార్తలు