వాట్సాప్ మాదిరి సరికొత్త ఫీచర్ తో గూగుల్... గ్రూప్ చాట్!

చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ కలిగి ఉన్న వారికి గూగుల్ మెసేజింగ్ యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మీ ఫోన్లలో నార్మల్ మెసేజ్ చేయడానికి ఉపయోగించే యాప్ ను గూగుల్ మెసేజింగ్ యాప్ అని అంటారు.

అయితే దీనిని ప్రస్తుతానికి బ్యాంకు అలెర్ట్స్ రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తున్నాం.అదే వాట్సప్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్ మీడియా యాప్స్ రాక మునుపు అందరూ దీనినే ఉపయోగించేవారు.

అప్పట్లో ఈ యాప్ నుండే ఫ్రెండ్స్ తో గంటలు గంటలు మనవాళ్ళు ముచ్చటించేవారు.ఇక మార్కెట్లోకి ఎప్పుడైతే వాట్సప్‌, ఫేస్‌బుక్‌ వంటి యాప్స్ పుట్టుకొచ్చాయో ఈ మెసేజింగ్ యాప్ కి ఆదరణ తగ్గిపోయింది.

గూగుల్.ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడం కూడా ఈ యాప్ ఆదరణ తగ్గిపోవడానికి మరొక కారణం అని చెప్పుకోవచ్చు.

Advertisement

దీంతో గూగుల్ మరలా సదరు యాప్ పైన ఫోకస్ పెడుతోంది.ఈ నేపథ్యంలో సదరు యాప్స్ మాదిరి తరహా ఫీచర్లను అందుబాటులోకి తేవడానికి యత్నిస్తోంది.

అవును, ‘వాట్సాప్‌’ గ్రూప్‌ చాట్ తరహాలోనే గూగుల్ మెసేజెస్‌ లో కూడా గ్రూప్‌ చాట్‌ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.

కాగా ప్రస్తుతం ఈ ఫీచర్‌ బీటా యూజర్లకు అందుబాటులో ఉందని తెలుస్తోంది.ప్రస్తుతం టెస్టింగ్ జరుగుతోంది.త్వరలో సాధారణ యూజర్లకు సైతం ఇది అందుబాటులోకి రానుంది.

గూగుల్ మెసేజెస్‌లో గ్రూప్‌ చాట్ ఫీచర్‌ ‘ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌’ అనే సెక్యూరిటీతో మనకు కనిపిస్తుంది.ఈ ప్రైవసీ ఫీచర్ సాయంతో ఈ సంభాషణలను సెండర్‌, రిసీవర్ మినహా ఇతరులెవరూ చూడలేరు, చదవలేరు.

న్యూస్ రౌండప్ టాప్ 20

ఇంకో విషయం ఏమంటే ఈ ఫీచర్‌తో పాటు గూగుల్ మెసేజెస్‌లో ఎమోజీ రియాక్షన్ ఫీచర్‌ను కూడా తీసుకు రానుంది.దీంతో యూజర్లు ఇతరులు పంపిన మెసేజ్‌లకు ఎమోజీలతో తమ స్పందనను తేలికగా తెలియజేయొచ్చు.

Advertisement

తాజా వార్తలు