తెలంగాణలో బీజేపీకి మంచి ఫలితాలు..: కిషన్ రెడ్డి

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీకి( Telangana BJP ) మంచి ఫలితాలు వచ్చాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) అన్నారు.

తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మి ఎనిమిది స్థానాల్లో గెలిపించారని కిషన్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో బీజేపీ అద్భుతమైన ఓటింగ్ శాతంతో పాటు సీట్లను పొందిందని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే అసెంబ్లీలో, లోక్ సభలో ఎనిమిది స్థానాల్లో గెలిపించడం తెలంగాణ ప్రజల ఆదరణకు నిదర్శనమని వెల్లడించారు.

అసెంబ్లీ ఎన్నికల తరువాత ఐదు నెలల వ్యవధిలో 37 శాతం ఓట్లు సాధించామన్నారు.బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదగాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ కు ( Congress ) కేవలం ఒక శాతం మాత్రమే ఓటింగ్ పెరిగిందని చెప్పారు.ఈ ఎన్నికలు రేవంత్ రెడ్డికి( Revanth Reddy ) రెఫరెండమని ప్రకటించి ఒక శాతం ఓట్లు పెంచుకున్నారని విమర్శించారు.

Advertisement

ఇక బీఆర్ఎస్ తెలంగాణలో ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు.మరోవైపు కేంద్రంలో ఎన్డీఏ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలిపారు.

కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?
Advertisement

తాజా వార్తలు