WhatsApp Community Feature : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. కమ్యూనిటీస్ ఫీచర్ లాంచ్!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీస్‌ ఫీచర్ రిలీజ్ చేసింది.

కాగా ఈ ఫీచర్ ఇంకా రానివారు కొద్ది వారాల పాటు వెయిట్ చేయాల్సిందే.

ఎందుకంటే ఈ ఫీచర్ మెల్లిమెల్లిగా అందరికీ రిలీజ్ అవుతుంది.ఈ ఫీచర్ ఆల్రెడీ పొందిన వారు కమ్యూనిటీస్ ట్యాబ్‌పై క్లిక్ చేయడం ద్వారా వేర్వేరు గ్రూప్స్‌ని కంబైన్ చేసి ఒక కమ్యూనిటీని క్రియేట్ చేసుకోవచ్చు.

ఈ కమ్యూనిటీలో 50 వాట్సాప్‌ గ్రూప్స్‌ని యాడ్ చేసుకోవచ్చు.పేరెంట్ గ్రూప్స్, స్కూల్, కాలేజీ, ఆఫీస్ వంటి గ్రూప్స్ ఒకే దగ్గర చేర్చేందుకు ఇది సహాయపడుతుంది.

ఉదాహరణకి పాఠశాల యాజమాన్యాలకు ఒక గ్రూపు, అందులో పని చేసే టీచర్స్ కి మరొక గ్రూపు, బస్సు డ్రైవర్లకి ఇంకొక గ్రూపు ఉన్నట్లయితే.వారికి ఏదైనా ముఖ్యమైన విషయం తెలపాలంటే ఆ అన్ని గ్రూపులకు సపరేట్‌గా మెసేజ్ పంపాల్సి ఉంటుంది.

Advertisement
Good News For WhatsApp Users.. Communities Feature Launch , WhatsApp, Community

అదే కమ్యూనిటీస్ కింద ఆ గ్రూప్స్ అన్ని షేర్ చేస్తే ఒక మెసేజ్ పంపినా అందరికీ ఆ విషయం తెలుస్తుంది.దీనివల్ల చాలా సమయం సేవ్ అవుతుంది.

అలాగే వేగంగా ఒకేసారి అందరికీ చెప్పాల్సిన విషయాన్ని తెలియజేయవచ్చు.

Good News For Whatsapp Users.. Communities Feature Launch , Whatsapp, Community

కమ్యూనిటీ ఫీచర్ ఉపయోగించి గ్రూప్స్‌న్నీ ఒక దగ్గర చేర్చడం చాలా ఈజీ.ఇందుకోసం వాట్సాప్ హోమ్ పేజీలో టాప్ లెఫ్ట్ కార్నర్‌లో గ్రూప్ పీపుల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి.ఆ తర్వాత ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేసిన గ్రూప్స్‌ని ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది.

ప్రస్తుతానికి ఇండియన్ యూజర్స్‌ అందరికీ ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి వచ్చినట్లు లేదు.కాబట్టి దీనికోసం మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.వాట్సాప్ ఎడిట్ బటన్, 2జీబీ వరకు ఫైల్ షేరింగ్ క్యాపబిలిటీ తదితర ఫీచర్స్ కూడా త్వరలోనే యూజర్లకు పరిచయం చేయనుంది.

టికెట్స్ వివాదం : సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?
Advertisement

తాజా వార్తలు