ఫ్లిప్ కార్ట్( Flipkart ) వినియోగదారులకు శుభవార్త.ఈ కామర్స్ దిగ్గజం మరో భారీ సేల్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది.
విషయం ఏమిటంటే, ఈ నెల 5వ తేదీ నుంచి బిగ్ సేవింగ్ డేస్ ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.చాలా రోజుల తర్వాత ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ప్రకటించడంతో వినియోగదారులకు ఇది మంచి తరుణమని చెప్పుకోవాలి.
ఈ సేల్ లో ఏకంగా 75 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.ఈ సేల్ లో SBI క్రెడిట్ కార్డ్( SBI Credit Card ) ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై 10 శాతం వరకు డిస్కౌంట్ ఉండడం మరొక అడ్వాంటేజ్.
ఇకపొయే ఈ సేల్ లో ఏసీలు ప్రారంభ ధర రూ.24 వేల నుంచే మొదలు కాబోతున్నట్టు సేల్స్ పేజీలో పేర్కొన్నారు.అదేవిధంగా హోం అప్లియెన్సెస్ పై 70 శాతం వరకు తగ్గింపులు ఉంటాయని చెప్పుకొచ్చింది ఫ్లిప్ కార్ట్.
అంతేకాకుండా ఇంకా రిఫ్రిజిరేటర్లు( Refrigerators ) రూ.13,990 ప్రారంభ ధర నుంచి అందుబాటులో ఉండగా, డిష్ వాషర్లు రూ.19,490 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.ఇంకా ఈ సేల్ లో బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉండడం గమనార్హం.
ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతపై 5 శాతం వరకు అన్ లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అవకాశం ఉంది.అదేవిధంగా SBI కార్డుపై 10 శాతం వరకు, పేటీఎం వ్యాలెట్ ట్రాన్సాక్షన్లపై రూ.100 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు వున్నాయి.కాబట్టి ఎప్పటినుండో ఆఫర్లలో వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నవారికి ఇది మంచి అవకాశమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
కావున ఈ సదవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకుంటారని ఫ్లిప్ కార్ట్ అభిప్రాయపడుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy