OTT Tata Play Bing : ఓటీటీ వీక్షకులకు గుడ్ న్యూస్.. రూ.175కే 11 యాప్‌ల సబ్‌స్క్రిప్షన్

కోవిడ్ అనంతరం చాలా మంది సినిమా థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు.ఇంట్లోనే ఓటీటీ ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్ వంటివి చూడడం ప్రారంభించారు.

అయితే ఒక్కో ఓటీటీ యాప్‌కు సంవత్సరానికి రూ.1000కి మించి కడుతున్నారు.ఓ నాలుగు యాప్‌లు ఉన్నాయంటే వాటికి అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది.

ఈ తరుణంలో ఓటీటీ ప్రియులకు టాటా ప్లే బింగ్ గుడ్ న్యూస్ అందిస్తోంది.నెలకు రూ.175 కడితే చాలు ఏకంగా 11 ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది.నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఏడాదికి సంబంధించి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను కూడా టాటా ప్లే బింగ్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

నెలకు రూ.175 కడితే టాటా ప్లే బింగ్ ద్వారా వివిధ యాప్‌లను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.డిస్నీ + హాట్ స్టార్, జీ5, ఎంఎక్స్ ప్లేయర్, వూట్ సెలెక్ట్, హోయ్‌చోయ్, హంగామా ప్లే వంటి ఎన్నో యాప్‌లను వీక్షించవచ్చు.ఏడాదికి రూ.175 కంటే రూ.999 కడితే ఇవే ప్రయోజనాలను సంవత్సరం పొడవునా పొందొచ్చు.ఈ ప్లాన్‌లో మీరు ఐపీఎల్ వీక్షించవచ్చు.

Advertisement

అంతేకాకుండా డిస్నీ + హాట్ స్టార్, ఈరోస్ నౌ, జీ5, ఎంఎక్స్ ప్లేయర్, వూట్ సెలెక్ట్, హోయ్‌చోయ్, హంగామా ప్లే వంటి యాప్‌లలో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడొచ్చు.రూ.999 ప్లాన్‌తో పాటు, టాటా ప్లే బింగే యాప్‌లో అనేక ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.అందుబాటులో ఉన్న ఇతర ప్లాన్‌లు నెలకు రూ.59, నెలకు రూ.125, నెలకు రూ.299 ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.నెలకు రూ.59 ప్లాన్‌లో ఎంఎక్స్ స్టార్టర్, జీ5 స్టార్టర్, వూట్ స్టార్టర్, వంటివి లభిస్తాయి.యూజర్లు ఈ సబ్‌స్క్రిప్షన్ కింద 8 ఓటీటీ యాప్‌లను పొందొచ్చు.

తాజా సినిమాలు, టీవీ షోలు వంటివి వీక్షించవచ్చు.

Advertisement

తాజా వార్తలు