ఎండాకాలంలో తిరుమలకు వచ్చే.. భక్తులకు శుభవార్త..

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది.శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులతో తిరుమల పుణ్యక్షేత్రం ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది.

మహాశివరాత్రి పర్వదినంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడం వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి ఉన్నాయి.

దీనివల్ల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు పది గంటల నుంచి 12 గంటల సమయం పడుతుంది.టైం స్లాట్ క్రింద దర్శనానికి వచ్చే భక్తులకు ఐదు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది.

మహాశివరాత్రి పండుగ రోజు దాదాపు 71, 350 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.వారిలో దాదాపు 29వేల మంది స్వామివారికి తలనీలాలను సమర్పించారు.

Advertisement

తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా వచ్చిన ఆదాయం దాదాపు మూడున్నర కోట్లు.ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ వివిధ రకాల పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్స్ వెలువడిన విషయం తెలిసిందే.విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

ఈ షెడ్యూల్స్ అన్ని ముగిసిన తర్వాత తిరుమల కు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తిరుమల దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ పరిస్థితుల మధ్య ఏపీఎస్ఆర్టీసీ అధికారులు శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పారు.

ఎండాకాలంలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏసీ బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించారు.Aps RTC వారు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకుని రానున్నారు.

తిరుపతి నుంచి వివిధ జిల్లాల మధ్య ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రవేశ పెట్టడానికి అన్ని చర్యలు తీసుకున్నారు.ఈ బస్సులను ఎప్పటినుంచి నడిపించాలనే విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
బ‌ల‌హీన‌మైన కురుల‌కు బ‌లానిచ్చే బెస్ట్ ఆయిల్ ఇదే..త‌ప్ప‌కుండా తెలుసుకోండి!

గ్రీన్ సప్తగిరి పేరుతో ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఆర్టీసీ అధికారులు నడిపించనున్నారు.ముందుగా తిరుపతి-కడప, తిరుపతి-నెల్లూరు, తిరుపతి-మదనపల్లి మధ్య వీటిని ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకుని రానున్నారు.

Advertisement

తాజా వార్తలు