ఏపీకి మంచి రోజులే ప్రధాని మోడీ ప్రసంగంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో వారం రోజుల్లో ఎన్నికలు. ప్రచారానికి ఈ వారమే చివరివారం కావడంతో.

ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.2014లో మాదిరిగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలసి పోటీ చేస్తున్నాయి.ఇదిలా ఉంటే సోమవారం ప్రధాని మోడీ( PM Modi ) ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

విశాఖ జిల్లా అనకాపల్లిలో( Anakapally ) నిర్వహించిన సభలో ప్రధాని మోడీ ఏపీ అభివృద్ధి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలియజేశారు.

దీంతో ప్రధాని మోడీ ప్రసంగంపై చంద్రబాబు( Chandrababu ) స్పందించారు.

Good Days For Ap Chandrababu Key Comments On Prime Minister Modi Speech Details,

ఏపీని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని మోడీ భరోసా ఇవ్వటం చాలా సంతోషించదగ్గ విషయం.ఇక రాష్ట్రానికి అన్ని మంచి రోజులే.కూటమిగా ఎందుకు ఏర్పడ్డామో మోడీ, అమిత్ షా వివరించారు.

Advertisement
Good Days For AP Chandrababu Key Comments On Prime Minister Modi Speech Details,

ప్రజలు గెలవాలి.రాష్ట్రం నిలవాలి.

రాష్ట్రంలో ఎన్డీఏ ( NDA ) గెలుపును ఎవరు అడ్డుకోలేరు.ఈ ఎన్నికలలో అవినీతి వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్లటం ఖాయం.అధికారం ఉందని జగన్ విర్రవీగారు.25 లోక్ సభ, 160 అసెంబ్లీ స్థానాలలో కూటమిదే విజయం అని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ ఎన్నికల్లో సైకో జగన్ పోవాలని సెటైర్లు వేశారు.

కచ్చితంగా జరగబోయే ఎన్నికలలో కూటమి అధికారంలోకి రాబోతుందని చంద్రబాబు సంచలన ప్రసంగం చేశారు.

నల్లటి వలయాలతో వర్రీ వద్దు.. విటమిన్ ఈ ఆయిల్ తో వారం రోజుల్లో వాటికి బై బై చెప్పండి!
Advertisement

తాజా వార్తలు